Take a fresh look at your lifestyle.

తెలంగాణ స్పోర్ట్స్ స్కూల్‌లో ప్రవేశాల కోసం జిల్లా స్థాయి ఎంపికలు

 

ముద్ర ప్రతినిధి నాగర్ కర్నూల్:

నాగర్ కర్నూల్: తెలంగాణ ప్రభుత్వం జిల్లా యువజన మరియు క్రీడల శాఖ ఆధ్వర్యంలో స్పోర్ట్స్ స్కూల్, హకీంపేట్‌లో 2026-27 విద్యాసంవత్సరానికి నాల్గవ తరగతి ప్రవేశాల కోసం జిల్లా స్థాయి ఎంపిక పోటీలు నిర్వహించనున్నట్లు జిల్లా యువజన మరియు క్రీడల అధికారి వి. సీతారాం తెలిపారు.

వైస్ చైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్, SATG ఆదేశాలు మరియు జిల్లా కలెక్టర్ అనుమతితో ఈ ఎంపికలు ఈ నెల 30-03-2026న నాగర్ కర్నూల్ పట్టణంలోని జిల్లా పరిషత్ హైస్కూల్ (బాలుర) క్రీడా మైదానంలో నిర్వహించబడతాయి.

ఈ ఎంపికలలో పాల్గొనదలచిన బాలురు, బాలికలు 01-09-2017 నుండి 31-08-2018 మధ్య జన్మించి ఉండాలి (వయస్సు 8 నుండి 9 సంవత్సరాలు). ప్రతి విభాగంలో 10 బాలురు, 10 బాలికలను ఎంపిక చేయనున్నారు.

తీసుకురావాల్సిన పత్రాలు:

ఆధార్ కార్డు

ప్రస్తుత పాఠశాల నుండి 3వ తరగతి స్టడీ సర్టిఫికెట్

జనన ధృవీకరణ పత్రం (MRO/మున్సిపాలిటీ)

3వ తరగతి ప్రోగ్రెస్ రిపోర్ట్

కుల ధృవీకరణ పత్రం

5 పాస్‌పోర్ట్ సైజు ఫోటోలు

పై పత్రాల ఒరిజినల్స్‌తో పాటు రెండు జతల జిరాక్స్ కాపీలు

ఎంపిక పరీక్షల వివరాలు:
ఎత్తు, బరువు, ఫ్లెక్సిబిలిటీ టెస్ట్, వర్టికల్ జంప్, స్టాండింగ్ బ్రాడ్ జంప్, మెడిసిన్ బాల్ త్రో, 30 మీటర్ల ఫ్లైయింగ్ స్టార్ట్, 6×10 మీటర్ల షటిల్ రన్, 800 మీటర్ల పరుగు పందెం వంటి పరీక్షలు నిర్వహించబడతాయి.

అర్హత గల విద్యార్థులు నిర్ణీత తేదీన హాజరై ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని అధికారులు సూచించారు.

Leave A Reply

Your email address will not be published.