Take a fresh look at your lifestyle.

శ్రీదేవి థియేటర్ రోడ్డు నుండి అమీన్ పూర్ వరకు రూ.45 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో నూతనంగా చేపట్టనున్న రహదారి విస్తరణ

  • ఐటీ, పరిశ్రమలు,వాణిజ్యం, శాసన సభ వ్యవహారాల శాఖ మంత్రి సుదీర్ బాబు , పీఏసీ చైర్మన్,ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ.

ముద్ర, శేరిలింగంపల్లి – విలేకరి: శ్రీదేవి థియేటర్ రోడ్డు నుండి అమీన్ పూర్ వరకు రూ.45 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో నూతనంగా చేపట్టనున్న రహదారి విస్తరణ పనులకు ఐటీ, పరిశ్రమలు, వాణిజ్యం, శాసన సభ వ్యవహారాల శాఖ మంత్రి సుదీర్ బాబు గురువారం పీఏసీ చైర్మన్,ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ,కార్పొరేటర్లు మంజుల రఘునాథ్ రెడ్డి,రాగం నాగేందర్ యాదవ్,డీసీ మోహన్ రెడ్డి లతో కలిసి శంకుస్థాపన చేశారు.ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ ట్రాఫిక్ పెరుగుతున్న దృష్ట్యా ప్రజా సౌకర్యార్థం రహదారి విస్తరణ చేపడుతున్నామని మంత్రి స్పష్టం చేశారు.రోడ్డు విస్తరణ పనులు త్వరగా పూర్తిచేసి ప్రజలకు అందుబాటులో తీసుకురావడం మా లక్ష్యం. ప్రజల సౌకర్యార్థం సమగ్ర ఏర్పాట్లు చేయాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాం,” అని పేర్కొన్నారు.ఆయన మరింతగా వివరించగా, “రోడ్డు విస్తరణతో వాహనాల రద్దీ తగ్గి, ట్రాఫిక్ సమస్యలను పరిష్కరించటం మాత్రమే కాదు, సమయం మరియు ఇంధన ఖర్చు కూడా తగ్గుతుంది. అలాగే, రోడ్డు విస్తరణ పూర్తయిన తర్వాత ప్రజలకు మరింత సౌకర్యవంతమైన ప్రయాణం అందుబాటులో ఉంటుంది. చుట్టుపక్కల కాలనీల్లో నివసించే ప్రజలకు, వారికే ప్రయోజనకరమైన మార్గాలను కల్పించే దిశగా కృషి చేస్తాము.”అని గాంధీ చెప్పారు.ప్రజలకు అనువైన మౌలిక వసతులు కూడా కల్పించాలని, ట్రాఫిక్ సమస్యలు తగ్గించేందుకు, పలు మౌలిక నిర్మాణాలను చేపడుతున్నట్లు ఆయన తెలిపారు. “ఇటీవల జరిగిన ప్లై ఓవర్ లు, లింక్ రోడ్లు, అన్నీ ప్రజలకు సహాయం చేయడానికి మాత్రమే. రోడ్డు నిర్మాణాలపై ఖర్చు చేసిన కోట్ల రూపాయల వలన, ప్రజల ప్రయాణాలు సులభంగా జరిగేలా చేయాలని మనదైన ప్రయత్నం,” అన్నారు.అనంతరం ఎమ్మెల్యే గాంధీ మాట్లాడుతూ శేరిలింగంపల్లి నియోజకవర్గ అభివృద్ధి కై గతంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రూ. 1650 కోట్ల నిధులు మంజూరు చేసారని,సీఎం రేవంత్ రెడ్డి మార్గదర్శకంలో మంత్రి శ్రీధర్ బాబు సహకారంతో శేరిలింగంపల్లి నియోజకవర్గాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేస్తున్నామని, శేరిలింగంపల్లి నియోజకవర్గం ను అగ్రభాగాన నిలబెడుతామని ఎమ్మెల్యే గాంధీ అన్నారు.ఈ కార్యక్రమంలో ప్రాజెక్ట్స్ అధికారులు ఎస్ఈ శ్రీ లక్ష్మీ, ఈఈ నామ్యా డీఈ హరీష్ బాబు, ఏఈ శివ కృష్ణ యాదవ్ మాజీ కౌన్సిలర్లు, మాజీ కార్పొరేటర్లు నాయకులు, కాలనీల అసోసియేషన్ సభ్యులు, కాలనీల వాసులు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.