Take a fresh look at your lifestyle.

భూగర్భ ఆస్తులకు నష్టం కలగకుండా చర్యలు తీసుకోవాలి: కలెక్టర్ ప్రతిమా సింగ్

 
ముద్ర ప్రతినిధి, మెదక్:
భూగర్భ ఆస్తులకు నష్టం కలగకుండా చర్యలు
తీసుకోవాలని కలెక్టర్ ప్రతిమా సింగ్ సూచించారు. శనివారం కలెక్టరేట్లో విద్యుత్, నీటిపారుదల, టెలికాం, టి- ఫైబర్, గ్రామపంచాయతీ, ఆర్ అండ్ బి, మిషన్ భగీరథ, పంచాయతీరాజ్, అటవీ, ఇంట్రా గ్రిడ్ అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ… యాప్‌ను భారత ప్రభుత్వం రూపొందించింది. తవ్వే సమయంలో భూగర్భ లైన్లు దెబ్బతినకుండా కాపాడటం. తవ్వకం ముందు సమాచారం ఇవ్వడం ఎక్కడ తవ్వకం చేయబోతున్నారో ముందుగా యాప్ లో నమోదు చేయవచ్చని తెలిపారు. భూగర్భ సదుపాయాల వివరాలు తెలుసుకోవడం ద్వారా ఆ ప్రాంతంలో ఉన్న ఫైబర్ కేబుల్స్, గ్యాస్ పైపులు, నీటి లైన్లు, వంటి వివరాలు తెలుసుకోవచ్చన్నారు.
భూగర్భ ఆస్తులకు నష్టం కలగకుండా తవ్వకాలు జరపడం చాలా ముఖ్యమన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ నగేష్, డిపిఓ యాదయ్య, జిల్లా అటవీ అధికారి జోజీ, ఈ.డి.యం సందీప్, టి -ఫైబర్ మేనేజర్ ఈశ్వర్, డిఈ అవినాష్, అసిస్టెంట్ జనరల్ మేనేజర్ రామ్, మిషన్ భగీరథ అధికారి సంపత్, గ్రిడ్ అధికారి నాగభూషణం,
ఈఈ పిఆర్ నర్సింలు తదితరులు పాల్గొన్నారు

Leave A Reply

Your email address will not be published.