Take a fresh look at your lifestyle.

పుస్తకాలు జ్ఞాన బండారాలు ప్రిన్సిపల్ డా, సునీతా

 

ముద్ర ప్రతినిధి, సిద్దిపేట :

పుస్తకాలు జ్ఞాన బండారాలు అని సిద్దిపేట ప్రభుత్వ డిగ్రీ కాళశాల ప్రిన్సిపల్ డా, సునీతా అన్నారు.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకగా చేపట్టిన 99 రోజుల ‘ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక’*లో భాగంగా, కళాశాల లైబ్రరీ విభాగం ఆధ్వర్యంలో నేడు భారీ పుస్తక ప్రదర్శనను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమాన్ని కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ G. సునీత జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు.”పుస్తకాలు జ్ఞాన భాండాగారాలు. విద్యార్థులు కేవలం పాఠ్యపుస్తకాలకే పరిమితం కాకుండా, ప్రపంచ జ్ఞానాన్ని పెంపొందించుకోవడానికి లైబ్రరీని దేవాలయంగా భావించాలన్నారు . రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఈ ప్రగతి ప్రణాళికలో భాగంగా విద్యార్థులకు పఠనాసక్తిని పెంచేందుకు ఇలాంటి ప్రదర్శనలు ఎంతగానో దోహదపడతాయన్నారు . ప్రతి విద్యార్థి రోజుకు కనీసం ఒక గంట సమయాన్ని గ్రంథాలయంలో గడపాలని, తద్వారా ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చని ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ G. సునీత ఆకాంక్షించారు.”
ఇంచార్జీ లైబ్రేరియన్ డా. మనోహర్ “గ్రంథాలయ కమిటీ కన్వీనర్‌ మాట్లాడుతూ లైబ్రరీ విభాగాన్ని విద్యార్థులకు మరింత చేరువ చేయడమే మా లక్ష్యం. శనివారం ఏర్పాటు చేసిన ప్రదర్శనలో పోటీ పరీక్షలకు ఉపయోగపడే పుస్తకాలతో పాటు, సాహిత్యం, వ్యక్తిత్వ వికాసం సైన్స్‌కు సంబంధించిన అరుదైన గ్రంథాలను అందుబాటులో ఉంచామన్నారు. డిజిటల్ యుగంలో ఉన్నప్పటికీ, ముద్రిత పుస్తకం ఇచ్చే అనుభూతి, జ్ఞానం వెలకట్టలేనివి. విద్యార్థులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాను.”
ఈ కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపల్ ప్రొఫెసర్ అయోధ్య రెడ్డి,IQAC సమన్వయ కర్త డా.మధు సూదన్, COE డా.గోపాల సుదర్శనం, లైబ్రరీ కమిటీ సభ్యులు వివిధ విభాగాల అధ్యాపకులు, పెద్ద సంఖ్యలో విద్యార్థులు పాల్గొని ప్రదర్శనలోని పుస్తకాలను ఆసక్తిగా వీక్షించారు. లైబ్రరీ విభాగం చేసిన ఈ కృషితో కళాశాలలో పఠన సంస్కృతి మరింత బలపడుతుందని అధ్యాపకులు కొనియాడారు.

Leave A Reply

Your email address will not be published.