Take a fresh look at your lifestyle.

చెరువులను పరిరక్షించుకోవాలి -అదనపు కలెక్టర్ నగేష్

 

ముద్ర ప్రతినిధి, మెదక్:

చెరువులను పరిరక్షించుకోవాలని అదనపు కలెక్టర్ నగేష్ అన్నారు.

శనివారం మెదక్ మండలంలోని కోముటూరు చెరువు కట్టపై ప్రజా పాలన- ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా నీటిపారుదల శాఖ ఆధ్వర్యంలో చెరువుల పరిరక్షణపై అవగాహన కల్పించారు.  అదనపు కలెక్టర్ నగేష్ మాట్లాడుతూ.. చెరువుల పరిరక్షణ, పూడిక తీత, ముళ్ల పొదల తొలగింపుపై అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు. చెరువు బాగుంటేనే ఊరు బాగుంటుందని, చెరువు ద్వారా పంటలు పండి గ్రామాలు ఆభివృద్ధి సాధిస్తాయని అన్నారు.

నీటిపారుదల శాఖ అధికారి శ్రీనివాసరావు మాట్లాడుతూ.. చెరువులను కాపాడుకొని పరిరక్షించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిది అన్నారు. చెరువులను అక్రమాల నుండి, కాలుష్యం నుండి కాపాడుకోవాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో మెదక్ తహసిల్దార్ లక్ష్మణ్ బాబు, డీఈ శివ నాగరాజు, నీటిపారుదల శాఖ అధికారులు, స్థానిక సర్పంచ్ యాదగౌడ్ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.