* తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును భారత్ పాకిస్తాన్ తో పోల్చడం సరికాదు
* హిందుత్వం పేరుతో బీజేపీ నీచ రాజకీయం చేస్తున్నది
* సిద్ధిపేట కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గం ఇన్చార్జ్ పూజల హరికృష్ణ పట్టణం అధ్యక్షుడు అత్తు ఇమామ్
ముద్ర ప్రతినిధి,సిద్ధిపేట:
తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుపై మొదటి నుండి బీజేపీ అవమానించేలా వ్యవహరిస్తోంది అని ఇప్పుడు బీజేపీ ఎంపీ తేజస్వీ చేసిన వ్యాఖ్యలతో మరోసారి బయటపడిందని సిద్ధిపేట కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గం ఇన్చార్జ్ పూజల హరికృష్ణ పట్టణం అధ్యక్షుడు అత్తు ఇమామ్ మండిపడ్డారు.

సిద్ధిపేటలోని ముస్తాబాద్ చౌరస్తా వద్ద తెలంగాణ ఏర్పాటును భారత్-పాకిస్థాన్ విభజనతో పోల్చిన బీజేపీ ఎంపీ తేజస్వీ సూర్య చేసిన అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తు ధర్నా నిర్వహించారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం ఎంతో మంది ప్రశ్న త్యాగాలు చేసి అమరులు అయ్యారని అన్నారు. అందరి త్యాగాలతో నాడు సోనియాగాంధీ గుర్తించి తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేశారు అని అన్నారు. అలాంటి రాష్ట్ర ఏర్పాటుపై బీజేపీ నాయకులు అవమానించేలా మాట్లాడటం సిగ్గుచేటు అని అన్నారు. తెలంగాణ అస్తిత్వాన్ని, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును అవమానించిన బీజేపీ ఎంపీ తేజస్వీ సూర్యను వెంటనే భర్తరఫ్ చేయాలి అని డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును భారతదేశం-పాకిస్తాన్ విభజనతో పో ల్చడం తెలంగాణ ప్రజలను అవమానించడమే అని అన్నారు. గతంలో ప్రధాని మోదీ తల్లిని చంపి బిడ్డను వేరు చేశారని తెలంగాణ ప్రజలను అవమానించారని తాజాగా బీజేపీ ఎంపీ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై అనుచిత వ్యాఖ్యలు చేయడం ఆ పార్టీ నైజం బయటపడింది అని అన్నారు. తెలంగాణ రాష్ట్రం నుంచి బీజేపీకి చెందిన ఇద్దరు మంత్రులు ఉండి కూడా తెలంగాణ ప్రజలను అవమానించేలా మాట్లాడిన ఎంపీ తీరును ఖండించకపోవడం దారుణం అని అన్నారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీకి ప్రజలు తగిన గుణపాఠం చెప్పడం ఖాయం అని అన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని అగౌరవపరిచేలా మాట్లాడటం తేజస్వి సూర్య అజ్ఞానానికి నిదర్శనం అని అన్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ సాకే ఆనంద్ బొమ్మల యాదగిరి ముద్ధం లక్ష్మి గయాజుద్దీన్ వహాబ్ రషద్ అర్షద్ హుస్సేన్ అజ్మత్ సంతోషి పద్మా రెడ్డి సనా రజిని అంజి రెడీ తదితరులు నాయకులు పాల్గొన్నారు