మోత్కూర్ ముద్ర న్యూస్:
ర్యాంపు ప్రాజెక్ట్ లో భాగంగా మండలంలోనీ మహిళ సమాఖ్య కార్యాలయంలో జిల్లా ఈడీసీ మేనేజర్ కుమ్మరికుంట్ల రంజిత్ కుమార్ ఆధ్వర్యంలో పీఎం విశ్వకర్మ పథకం పై అవగాహన సదస్సు నిర్వహించారు .ఈ సందర్భంగా దాదాపు 35 మందికి సంప్రదాయ వృత్తిదారులు, శిల్పులు , సూక్ష్మ, చిన్న మధ్య తరహా వ్యాపారవేత్తలకు పథకం ప్రయోజనాలు, రుణ సదుపాయాలు, శిక్షణ, టూల్ కిట్ సహాయం వ్యాపార అభివృద్ధి అవకాశాలపై ట్రైనర్ అశోక్ క్లుప్తంగా వివరించారు.బ్యాంకులు వాటి పరిమితులు విధి విధానాలు ఎ రకంగా లోన్లు మంజూరు చేస్తాయి వాటి షరతులు తదితర అంశాలను ఎస్బిఐ ఫీల్డ్ ఆఫీసర్ ప్రవీణ్ , తెలంగాణ గ్రామీణ బ్యాంకు మేనేజర్ సత్యనారాయణ వివరించారు.
ర్యాంపు కార్యక్రమం ద్వారా ఏంఏస్ఏంఈ ల పనితీరును మెరుగుపరచడం, నైపుణ్య అభివృద్ధి, ఆర్థిక సహాయం, టూల్కిట్ ప్రోత్సాహకాలు, డిజిటల్ మార్కెటింగ్ మద్దతు కల్పించడం సామర్థ్య వృద్ధి సాధించడం లక్ష్యంగా పెట్టుకున్నారు.ప్రధానమంత్రి విశ్వకర్మ పథకం పట్ల అవగాహన కల్పించడంతో పాటు లబ్ధిదారుల సమస్యలు పరిష్కరించేందుకు ఈ సెమినారు ఏర్పాటు చేసినట్లు వారు తెలిపారు.
ఈ కార్యక్రమంలో
ఈడీసీ అసిస్టెంట్ మేనేజరు మహేష్ ,లక్ష్మీ నర్సయ్య తదితరులు పాల్గొన్నారు.