Take a fresh look at your lifestyle.

వీధి కుక్కల బెడద నుంచి రక్షించాలి

రామకృష్ణాపూర్, ముద్ర విలేకరి : వీధి కుక్కలు బెడద కారణంగా జీవనాధారం కోల్పోవాల్సి వస్తుందని,వాటి నుంచి రక్షించాలని క్యాతన్ పల్లి గ్రామాలకు చెందిన ప్రజలు శనివారం మున్సిపల్ కమిషనర్ గద్దె రాజు దృష్టికి తీసుకెళ్లారు. క్యాతన్ పల్లి,కుర్మపల్లి,దుబ్బపల్లి గ్రామాలలో వీధి కుక్కలు గుంపులుగా చేరి బర్రెలు,దూడల మీద దాడులు చేస్తున్నాయని గ్రామానికి చెందిన శివ కుమార్,మహేందర్,సంతోష్,శేఖర్,మురళీ,అభిలాష్ వినతి పత్రాన్ని అందించారు. దాడులలో దూడలు మరణించడంతో బర్రెలు పాలు ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. జీవన ఆధారమైన పశు సంపదను కాపాడాలని కోరారు.

Leave A Reply

Your email address will not be published.