Take a fresh look at your lifestyle.

సింగరేణి కార్మికుల పెండింగ్ సమస్యలు పరిష్కరించండి

  • సిఎండి డైరెక్టర్ (పా)లను కోరిన ఐ ఎన్ టి యు సి సెక్రెటరీ జనరల్ జనక్ ప్రసాద్.

ముద్ర ప్రతినిధి, గోదావరిఖని: సింగరేణి కార్మికుల పెండింగ్ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ శనివారం హైదరాబాద్ సింగరేణి భవన్ లో సింగరేణి సంస్థ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్, డైరెక్టర్ (పా) లను సెక్రటరీ జనరల్ జనక్ ప్రసాద్ఆధ్వర్యంలో ఐ ఎన్ టి ఏ సి ముఖ్య నాయకుల బృందం కలిసి పలు అంశాలపై చర్చించి కోరారు.ముఖ్యంగా అనేక పెండింగ్ సమస్యలు,హామీ లు వెంటనే అమలు చేయాలని కోరారు.కార్మికుల సొంత ఇంటి కల,కార్మికుల పెర్క్స్ మీద ఐటీ మాఫీ,డిస్మిస్ కార్మికుల సమస్యలు,మారుపేర్ల మార్పు, కొత్త బొగ్గు గనుల ప్రారంభం, సి పి ఆర్ ఎం ఎస్ సి కార్డ్ 8 లక్షల నుండి 10 లక్షల కి పెంపు వంటి అంశాలు పై చర్చించారు.ఈ సమావేశంలో సెంట్రల్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్లు నరసింహ రెడ్డి, ధర్మపురి,సమ్మయ్య,త్యాగరాజన్,జనరల్ సెక్రటరీ వికాస్ కుమార్ యాదవ్,సెంట్రల్ వైస్ ప్రెసిడెంట్ దాస్,రిజినల్ జనరల్ సెక్రటరీ ఆల్బర్ట్,సీనియర్ నాయకులు శంకర్రావు,పానుగంటి వెంకట స్వామి,తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.