Take a fresh look at your lifestyle.

కండ్లపెల్లి ఎస్టీలకు ఇళ్ళు, తండాకు రోడ్డు, బస్సు సౌకర్యం కల్పించాలి

  • మంత్రి సీతక్కకు కాంగ్రెస్ నేత మహంకాళి రాజన్న విజ్ఞప్తి

ముద్ర ప్రతినిధి,జగిత్యాల : ఊరికి దూరంలో అడవిలో ఉన్న ఎస్టీలకు ఇళ్ళు లేక నాన ఇబ్బందులు పడుతున్నారని వారికీ ఇళ్ళు మంజూరు చేయడమే కాకుండా ఆ తండాకు రోడ్డు, బస్సు సౌకర్యం కల్పించాలని రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ధనసరి సీతక్క కు మాజీ సర్పంచ్, కాంగ్రెస్ నాయకులు మహంకాళి రాజన్న విజ్ఞప్తి చేశారు.ఈ మేరకు సానుకూలంగా స్పందించిన మంత్రి సీతక్క అర్హులందరికి తక్షణమే ఇళ్ళు మంజూరు చేయాలనీ జగిత్యాల జిల్లా కలెక్టర్ ను అదేశించారాని రాజన్న తెలిపారు.జగిత్యాల జిల్లా బీరుపూర్ మండలం కండ్లపెల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని గల నాయకపు తండాలో 62 ఎస్టీ కుటుంబాలున్నాయని వారు గుడిసెల్లో జీవనాన్ని సాగిస్తూ ఇళ్ళు లేక, రోడ్డు సౌకర్యం లేక ఎన్నో రకాల ఇబ్బందులు పడుతున్నారని మంత్రి సీతక్క దృష్టికి తీసుకువచ్చినట్లు తెలిపారు.తండా వాసులు నిత్యావసర వస్తువులు, రేషన్ సరుకులు, జబ్బు పడితే మందులకోసం వేరే గ్రామానికి వెళ్లాలంటే చాలా కష్టపడుతున్నారని వాపోయారు.
కిలోమీటర్ కు పైగా దూరం ఉన్నందున రోడ్డు నిర్మాణం చేపట్టాలని, అలాగే తండాకు బస్సు సౌకర్యం కల్పించాలని మంత్రికీ దృష్టికి మహంకాళి రాజన్న తీసుకెళ్లారు.ఎస్టీ కుటుంబాలు ఎదురకొంటున్న సమస్యలను విన్న మంత్రి సీతక్క ఇళ్ల నిర్మాణం చేపట్టి, రోడ్డు, బస్సు సౌకర్యం కల్పించేవిధంగా జిల్లా కలెక్టర్ పరిశీలించి చర్యలు తీసుకోవాలని అదేశించారాని రాజన్న తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.