Take a fresh look at your lifestyle.

వడ్డేపల్లి నర్సింగరావు వర్ధంతి ఘన నివాళులర్పించిన కుమారుడు రాజేశ్వరరావు

ముద్ర కూకట్‌పల్లి :
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భూ ఖనిజాభివృద్ధి శాఖ మాజీ చైర్మన్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు స్వర్గీయ శ్రీ వడ్డేపల్లి నర్సింగరావు 12వ వర్ధంతి వేడుకలు కూకట్‌పల్లిలో ఘనంగా జరిగాయి. వివేకానంద నగర్ కాలనీలోని వీఎన్‌ఆర్ సర్కిల్ వద్ద నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఆయన కుమారుడు, కూకట్‌పల్లి నియోజకవర్గ బీజేపీ సీనియర్ నాయకులు శ్రీ వడ్డేపల్లి రాజేశ్వరరావు పాల్గొని, నర్సింగరావు విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా వడ్డేపల్లి రాజేశ్వరరావు మాట్లాడుతూ.. తన తండ్రి నర్సింగరావు జీవితాంతం ప్రజాసేవకే అంకితమైన గొప్ప నాయకుడని కొనియాడారు. రాజకీయాల్లో విలువలు, నిబద్ధత, ప్రజల పట్ల ప్రేమతో ఆయన ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారని గుర్తుచేశారు. ప్రజల సమస్యల పరిష్కారంలో ఎల్లప్పుడూ ముందుండేవారని, ఆయన చూపిన సేవా మార్గాన్ని ఆదర్శంగా తీసుకుని యువత సమాజ సేవలో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.
ఈ వర్ధంతి కార్యక్రమంలో వివిధ రాజకీయ పార్టీల స్థానిక నాయకులు, అభిమానులు, కాలనీవాసులు మరియు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వర్గీయ వడ్డేపల్లి నర్సింగరావుకు నివాళులు అర్పించారు.

Leave A Reply

Your email address will not be published.