మోత్కూరు మండలాన్ని నియోజకవర్గ కేంద్రంగా ఏర్పాటు చేయాలి. -బిఆర్ఎస్ఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు బుర్ర శ్రీనివాస్ గౌడ్.
ముద్ర,మోత్కూరు:
మోత్కూరు మండలాన్ని నియోజకవర్గ కేంద్రంగా ఏర్పాటు చేయాలని బిసి రిజర్వేషన్ సాధన సమితి (బిఆర్ఎస్ఎస్)రాష్ట్ర అధ్యక్షులు బుర్ర శ్రీనివాస్ గౌడ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం మోత్కూరుకు వచ్చిన ఎమ్మెల్సీ నెల్లికంటే సత్యం కు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ ఉమ్మడి నల్లగొండ జిల్లాలో అత్యంత వెనుకబడిన మోత్కూరు అభివృద్ధిలో ఆమడ దూరంలో ఉందన్నారు. మోత్కూరు నియోజకవర్గంగా లేకపోవడం వల్ల విద్యా వైద్య రవాణామార్గంగా ఇక్కడ ప్రజలు నోచుకోలేకపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు ఆత్మకూరు (ఎం), గుండాల, అడ్డగూడూరు, మోటకొండూర్ మండలాల కలిపి మోత్కూరును నియోజకవర్గ ఏర్పడితే ఆయా మండలాల ప్రజలకు మంచి సౌకర్యం ఉందన్నారు.ఈ 5 మండలాలలో 90 గ్రామపంచాయతీలు 68 రెవెన్యూ గ్రామాలను ఉన్నాయని ఆయన దృష్టికి తెచ్చారు. నాడు రామన్నపేట, నేడు తుంగతుర్తి నియోజకవర్గంలో పెద్ద మండలమైన మోత్కూరు ను నియోజవర్గం ఏర్పాటుకు శాసనమండలిలో ప్రస్తావించాలని ఎమ్మెల్సీ సత్యం ను కోరగా ఎంఎల్ సి హామీ ఇచ్చినట్లు శ్రీనివాస్ గౌడ్ తెలిపారు.ఈ కార్యక్రమంలో బీసీ రిజర్వేషన్ సాధన సమితి జిల్లా నాయకులు కలిమెల నర్సయ్య, స్థానిక నాయకులు ఎడ్ల నరేష్, అన్నెపు భాస్కర్, ఎడ్ల పక్కిరు తదితరులు పాల్గొన్నారు.