ముద్ర, తెలంగాణ బ్యూరో : రైల్వే సేఫ్టీ ఎక్సలెన్స్ అవార్డు ఆఫ్ ది ఇయర్ అవార్డును ఎల్ అండ్ టి మెట్రో రైలు దక్కించుకుంది. ఢిల్లీలో నిర్వహించిన ప్రతిష్టాత్మక ఎకనమిక్ టైమ్స్ ఇన్‌ఫ్రా రైల్ షో -2025లో ఈ అవార్డును ఎల్ అండ్ టి మెట్రో రైల్ (హైదరాబాద్) లిమిటెడ్‌కు దక్కింది. ఈ సందర్భంగా ఎల్ అండ్ టి ఎంఆర్‌హెచ్ ఎల్ ఎండి అండ్ సీఈవో కేవీబీ రెడ్డి మాట్లాడుతూ..జాతీయ స్థాయిలో గుర్తింపు పొందడమనేది హైదరాబాద్ మెట్రో రైల్‌కు ఎంతో గర్వకారణమైన మైలురాయిలాంటిదని అన్నారు.సురక్షితమైన, విశ్వసనీయమైన, ప్రపంచ స్థాయి అర్బన్ ట్రాన్సిట్ సొల్యూషన్స్‌ను అందించడంపై సంస్థకు గల నిబద్ధతకు ఇది నిదర్శనంగా నిలుస్తుందన్నారు.ప్రయాణికుల భద్రత, సమగ్ర రిస్క్ మేనేజ్‌మెంట్ విధానాలు, సాంకేతిక ఆవిష్కరణలపై ప్రధానంగా దృష్టి పెట్టిన హైదరాబాద్ మెట్రో రైల్ దేశవ్యాప్తంగా అగ్రగామి మెట్రో సిస్టమ్‌లతో పోటీ పడి ఈ పురస్కారాన్ని దక్కించుకుందని ఆయన వెల్లడించారు. ఇది తాము సాధించిన విజయాలకు గుర్తింపు మాత్రమే కాదని, అర్బన్ మొబిలిటీ భవిష్యత్తును మరింతగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత తమపై ఉందని ఆయన తెలిపారు.
