Take a fresh look at your lifestyle.

గోదావరి జల వివాదానికి బీఆర్​ఎసే కారణం

  • గత ప్రభుత్వ హయాంలోనే ఏపీకి లాభం చేకూర్చే నిర్ణయాలు.
  • తెలంగాణ హక్కులు కాపాడేందుకు ఎంత వరకైనా వెళ్తాం.
  • మీడియాతో మంత్రి శ్రీధర్​ బాబు.

ముద్ర, తెలంగాణ బ్యూరో : ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య తలెత్తిన గోదావరి జలాల వివాదానికి గత బీఆర్​ఎస్​ ప్రభుత్వమే కారణమని రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్​ బాబు ఆరోపించారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. గతంలోనే బీఆర్ఎస్ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌కు లాభం చేకూర్చే విధంగా నిర్ణయాలు తీసుకుందన్నారు. తెలంగాణ నీటి హక్కులను రక్షించడంలో తమ ప్రభుత్వం వెనుకాడటం లేదని స్పష్టం చేశారు. గోదావరి జలాల విషయంలో తెలంగాణ హక్కును కాపాడడంలో తాము ఎక్కడైనా, ఎంత వరకైనా వెళ్లి పోరాడేందుకు సిద్ధమని వ్యాఖ్​యానించారు. కొన్ని రాజకీయ పార్టీలు గోదావరి జలాల కోసం తాము మాత్రమే పోరాడుతున్నట్లు ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు. గోదావరి నది జలాల కొరకు మేడిగడ్డ, సుందిల్ల, అన్నారం ప్రాజెక్టులను నిర్మించామని గొప్పలు చెప్పే వాళ్ళు ఈ ప్రాంతానికి ఒక చుక్క నీరు ఇవ్వకుండా తరలించుకెళ్లారని మండిపడ్డారు. గోదావరి నది జలాలకు సంబంధించి ఎగువన ఉన్న మహారాష్ట్ర, దిగువన ఉన్న ఆంధ్ర వాళ్ళు తెలంగాణ రాష్టానికి నీరు ఇచ్చిన తర్వాతే మీరు తీసుకెళ్లాలని పేర్కొన్నారు. ట్రిబ్యునల్ ముందు మా రాష్ట్రానికి నీరు ఇచ్చిన తర్వాతే పక్కా రాష్ట్రాలకు నీటిని తరలించాలని అప్పుడే చెప్పామని శ్రీధర్ బాబు వెల్లడించారు.

Leave A Reply

Your email address will not be published.