Take a fresh look at your lifestyle.

బీసీ సంఘాల ఆధ్వర్యంలో పూలే జయంతి వేడుకలు

  • పాల్గొన్న ఎమ్మెల్సీ ఎల్.రమణ,మాజీ మంత్రి టి జీవన్ రెడ్డి.

ముద్ర, ప్రతినిధి, జగిత్యాల జగిత్యాల : మన సమాజానికి పునాదిరాయిగా నిలిచిన అణగారిన వర్గాల అభ్యున్నతికి పాటుపడిన మహాత్మా జ్యోతిభాపూలే కు భారత రత్న ఇవ్వాలని ఎమ్మెల్సీ ఎల్.రమణ,మాజీ మంత్రి టి.జీవన్ రెడ్డి,మాజీ జడ్పీ చైర్మన్ దావా వసంత లు కేంద్రప్రభుత్వం ను కోరారు. శుక్రవారం జిల్లా బీసీ సంఘాల ఆధ్వర్యంలో పూలే పార్కు లో మహాత్మా జ్యోతిబాపూలే 199 వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.ఈ. కార్యక్రమంలో జ్యోతీభాపూలే,సావిత్రీ భాయి పూలే విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు.ఈ సందర్భంగా ఎల్.రమణ, టి.జీవన్ రెడ్డి,దావా వసంత లు మాట్లాడుతూ పూలే మరణించి 130 ఏళ్ళు దాటినా ఆయన ఆలోచనలకు అనుగుణంగా అన్ని వర్గాల వారిలో సమానత్వం అనేది ఒక కుటుంబ విలువగా మార్చేందుకు బీసీ సంఘాలు కృషి చేయాలన్నారు. మాజీ మున్సిపల్ చైర్మన్ అడువాల జ్యోతి మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రభుత్వం ఏర్పడిన తొలి రోజుల్లోనే ప్రగతి భవన్ కు మహాత్మా జ్యోతిరావు పూలే పేరు పెట్టి ప్రజా భవన్ గా మార్చారన్నారు. మహిళా సాధికారత కు రాష్ట్ర ప్రభుత్వం సరికొత్త పథకాలు ప్రవేశపెట్టిందని ఆరు గ్యారెంటీ ల్లో భాగంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం తో పాటు రూ.500 గ్యాస్ సిలెండర్ పథకాలు ఆమలు చేయడం పట్ల మహిళలు హర్షం వ్యక్తం చేస్తున్నారని పేర్కొన్నారు. టీబీసీ జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు హరి ఆశోక్ కుమార్ మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం శాసనసభ లో వెనుకబడిన కులాలకి 42 శాతం రిజర్వేషన్లు ఆమోదించిన విధంగా అమల్లోకి తీసుకు రావాలన్నారు. పూలే జయంతి రోజున కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు సెలవు దినంగా ప్రకటించాలని,కేంద్ర స్థాయిలో బీసీ మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలని కోరారు. పూలే దంపతుల విగ్రహాలను తన స్వంత ఖర్చులతో ఏర్పాటు చేయించిన ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ కు బీసీ సంఘాల తరపున కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ అడువాల జ్యోతి, మున్సిపల్ కమీషనర్ స్పందన, బీసీ సంఘం రాష్ట్ర కార్యదర్శి ముసిపట్ల లక్ష్మీ నారాయణ, మానాల కిషన్, జిల్లా అధ్యక్షుడు బ్రహ్మాండ బేరి నరేష్,బీసీ సంఘాల మహిళా జిల్లా అధ్యక్షురాళ్లు కస్తూరి శ్రీమంజరి,గంగం జలజ,సింగం పద్మ,బైరి రాధ, ములస్తం శివ ప్రసాద్,జాజాల రమేష్, పి.హన్మంత్ రెడ్డి,కొక్కు గంగాధర్,ముఖేష్ ఖన్నా,చింతల గంగాధర్,తిరుపురం రాం చందర్,పెండెం చిన్న గంగాధర్,సంజయ్ సామ్రాట్, రాపర్తి రవి,పూసాల ఆశోక్ రావు,వెల్ముల ప్రకాష్ రావు,పుప్పాల నర్సింగ రావు, దుమాల రాజ్  కుమార్, జిల్లా డివిజన్, వివిధ మండలాల బీసీ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.