ముద్ర ప్రతినిధి, జడ్చర్ల : తెలంగాణ ఉద్యమం లో అసువులు బాసిన అమరుల త్యాగ ఫలితంతో సాధించుకున్న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. సోమవారం జడ్చర్ల పట్టణంలో నీ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే అనిల్ రెడ్డి పాల్గొని జండా ఆవిష్కరణ చేశారు.అనంతరం స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో పాల్గొన్నారు.అటు పెద్దప శ్రీకాంత్ చారి విగ్రహానికి జ్యోతిరావు పూలే అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎంతోమంది అమరుల త్యాగ ఫలితంతో సాధించుకున్న తెలంగాణ మరింత అభివృద్ధి పతంలో ముందుకెళ్లడానికి కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఎంతో కృషి చేస్తుందని అన్నారు. సందర్భంగా జడ్చర్ల మండల కేంద్రంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయల్లో జాతీయ జేండా ను ఎగర వేసి తేలంగాణ గీతాలు ఆలపించారు.మండల కేంద్రంలోని ఏంపిడిఓ, తహశీల్దార్, అగ్రికల్చర్, ప్రభుత్వ పాఠశాలలు, గ్రామపంచాయతీలలో, స్థానిక పోలిష్ స్టేషన్, ఎస్ టి ఓ కార్యాలయం లలో మువ్వన్నెల జేండా లు ఏగరావేసారు.ఈ సందర్భంగా ఉద్యామ వీరులను కోనియాడారు.తహశీల్దార్ కార్య లయంలో, ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీడీవో , జాతీయ జేండా ఏగరావేసారు. ఎమ్మార్వో నర్సింగరావు, ఎంపీడీవో విజయ్ కుమార్, అగ్రికల్చర్ అధికారి గోపీనాథ్, మున్సిపల్ కమిషనర్ లక్ష్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు.