ముద్ర ప్రతినిధి, జగిత్యాల : కల్తీ విత్తనాలను విక్రయించి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా వ్యవసాయ అధికారి భాస్కర్ హెచ్చరించారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని వందన, శైల సీడ్ ప్రాసెసింగ్ యూనిట్లను సోమవారం డి ఏ ఓ తనిఖి చేశారు. ఈ సందర్భంగా పలు రిజిష్టర్ లని, అనుమతి పత్రాలని, యంత్రాలను, విత్తనాలను పరిశీలించారు. విత్తనాలను కల్తీ చేయవద్దని, ఎం ఆర్ పి ధరలకు మించి అమ్మకూడదని సూచించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ అధికారులు తిరుపతి నాయక్, వినీల పాల్గొన్నారు.
