Take a fresh look at your lifestyle.

అధైర్య పడకండి, అండగా ఉంటాం -మాజీ మంత్రి వర్యులు సబితా ఇంద్రారెడ్డి, పరిగి మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి

ముద్ర, వికారాబాద్ జిల్లా ప్రతినిధి :

రైతులు అధైర్య పడవద్దు అని టిఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని మాజీ మంత్రి మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి రైతులకు భరోసానిచ్చారు. శుక్రవారం పరిగి మండలం రాపోల్ ఖడ్లాపూర్ గ్రామ రైతుల నిరసన దీక్షలో పాల్గొని మద్దతు ప్రకటించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ
ఇండస్ట్రియల్ పార్క్ పేరుతో, కడ్లాపూర్, రాపోల్ గ్రామాల్లో 1200 వందల ఎకరాలను దోచుకునే కుట్ర చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వనికి నిరసనగా, 11వ రోజు రిలే నిరహార దీక్ష కార్యక్రమంలో రాపోల్ కడ్లాపూర్ గ్రామాలకు శుక్రవారం వారికి మద్దతుగా మాజీ మంత్రి వర్యులు సబితా ఇంద్రారెడ్డి, పరిగి మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి, వికారాబాద్ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ లు సంఘీభావం తెలిపారు. మీ కోసం మేము కూడా మీ పోరాటంలో భాగమై, నీకు ఆసరాగా మీకు మద్దతుగా ఉంటామని, అన్ని రకాలుగా అండగా నిలుస్తాం అని, బి ఆర్ ఎస్ పార్టీ అండగా ఉంటుంది అని మీ భూములు తీసుకోకుండా పోరాటం చేద్దామని అన్నారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ నాయకులు రాపోలు కడ్లాపూర్ గ్రామాల రైతులు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.