Take a fresh look at your lifestyle.

విద్యార్థులకు అందుబాటులో టెలీమానస్ సేవలు- జిల్లా వైద్య,ఆరోగ్య శాఖ అధికారి ఉమా గౌరి

 

ముద్ర, మేడ్చల్ జిల్లా ప్రతినిధి:
మేడ్చల్–మల్కాజ్గిరి జిల్లాలో కొనసాగుతున్న పబ్లిక్ పరీక్షల నేపథ్యంలో విద్యార్థుల మానసిక ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని టెలిమానస్ సేవలను విస్తృతంగా అందుబాటులో ఉంచామని జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ ప్రకటించింది. పరీక్షల ఒత్తిడి, ఆందోళన, భయం వంటి సమస్యలను ఎదుర్కొంటున్న విద్యార్థులు ఉచితంగా 14416 మరియు 1-800-891-4416 హెల్ప్‌లైన్ నంబర్లకు కాల్ చేసి నిపుణులైన కౌన్సిలర్ల సలహాలు పొందవచ్చని తెలిపారు. విద్యార్థుల్లో అవగాహన పెంపొందించేందుకు ప్రతి పరీక్షా కేంద్రంలో టెలిమానస్ పోస్టర్లు ప్రదర్శించబడుతున్నాయి. అవసరమైతే ప్రత్యక్ష మానసిక ఆరోగ్య సేవలకు రిఫర్ చేసే సదుపాయం కూడా కల్పించబడింది.
పరీక్షల అనంతరం ఫలితాల సమయంలో కూడా విద్యార్థుల్లో మానసిక ఒత్తిడి పెరిగే అవకాశం ఉన్నందున టెలిమానస్ సేవలు నిరంతరం కొనసాగుతాయని తెలిపారు. విద్యార్థులు, తల్లిదండ్రులు ఈ సేవలను వినియోగించుకోవాలని, ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలని జిల్లా వైద్య,ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ సి. ఉమా గౌరి సూచించారు.

Leave A Reply

Your email address will not be published.