ముద్ర మల్కాజిగిరి:
మహిళల ఆర్థికాభివృద్ధి కోసం స్వయం సహాయక సంఘాల పాత్ర కీలకమని మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి పేర్కొన్నారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మల్కాజిగిరి, అల్వాల్ సర్కిళ్లకు చెందిన ప్రాజెక్ట్ ఆఫీసర్లు శాసనసభ్యులు మర్రి రాజశేఖర్ రెడ్డి ని మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించి, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ మహిళలకు ప్రభుత్వం అందిస్తున్న సహాయ సహకారాలు, నూతన రుణాల మంజూరు విధానం, బ్యాంకులతో సమన్వయం వంటి అంశాలపై సమగ్రంగా చర్చించారు. మహిళల ఆర్థికాభివృద్ధి కోసం స్వయం సహాయక సంఘాల పాత్ర కీలకమని ఆయన పేర్కొన్నారు.
ఎస్ హెచ్ జి మహిళలకు తక్కువ వడ్డీతో రుణాలు అందేలా చూడాలని, బ్యాంకర్లతో సమన్వయం పెంచాలని, అవసరమైతే తానే మధ్యవర్తిత్వం చేసి సమస్యలు పరిష్కరించేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. మహిళలు స్వయం ఉపాధి అవకాశాలను సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా ఎదగాలని, మహిళ సాధికారత సాధనలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో అల్వాల్ సర్కిల్ ప్రాజెక్ట్ ఆఫీసర్ సుధాకర్, మల్కాజ్గిరి–మౌలాలి–కీసర ప్రాజెక్ట్ ఆఫీసర్ నిరూపమ, కమ్యూనిటీ ఆర్గనైజర్లు అల్వాల్ సర్కిల్ ప్రవీణ్ కుమార్ పాల్గొన్నారు