Take a fresh look at your lifestyle.

ఉద్యోగులు ఆరోగ్యంగా ఉంటేనే సేవలు అందుతాయి -జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ

 

ముద్ర, మహదేవపూర్:

ఐడిఓసి కార్యాలయంలో తెలంగాణ గెజిటెడ్ ఉద్యోగుల సంగం ఆధ్వర్యంలో సిబ్బందికి ఆరోగ్య స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేసే సిబ్బంది నిరంతరం ప్రజలతో మమేకమై విధులు నిర్వహిస్తుంటారని, వారి ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ అవసరమని అన్నారు. ముందస్తు జాగ్రత్త చర్యలలో భాగంగా రక్తపోటు, షుగర్, హీమోగ్లోబిన్, బరువు, తదితర సాధారణ పరీక్షలు నిర్వహించినట్లు తెలిపారు. ఈ పరీక్షల ద్వారా ఆరోగ్య సమస్యలను ప్రారంభ దశలోనే గుర్తించి వచ్చే నెలల్లో స్పెషలిస్ట్ వైద్యులచే మెగా వైద్య క్యాంపు నిర్వహించి వైద్య సేవలు అందిస్తామని తెలిపారు. సిబ్బంది ప్రతి 6 నెలలకు ఒకసారి తప్పకుండా ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. ఆరోగ్యవంతమైన సిబ్బందే సమర్థవంతమైన పరిపాలనకు పునాది అన్నారు.
కార్యక్రమంలో ఎస్పి సంకీర్త్, అదనపు కలెక్టర్లు అశోక్ కుమార్, విజయలక్ష్మి, టిజిఓ కార్యదర్శి సునీల్ కుమార్, అసోసియేట్ ప్రెసిడెంట్ మహమ్మద్ సంధాని, కార్యవర్గ సభ్యులు డా మాడ్గుసూదన్, బాబూరావు, డా కుమారస్వామి, ఫణి కుమార్, డా వెంకన్న, సంతోష్, శ్రీనివాసరావు, రాధిక, స్వాతి టీజీఓ ప్రతినిధులు, టీఎన్జీవో అధ్యక్షులు బూరుగు రవి, నాల్గవ తరగతి ఉద్యోగుల సంగం అధ్యక్షులు శంకరయ్య,
వైద్య బృందం మరియు కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.