Take a fresh look at your lifestyle.

అభివృద్ధి సంక్షేమమే ప్రజా పాలన లక్ష్యం

  • పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవం చేసిన మంత్రి జూపల్లి కృష్ణారావు

ముద్ర, వీపనగండ్ల: అభివృద్ధి సంక్షేమమే ప్రజాపాలన లక్ష్యం అని, అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందుతాయని రాష్ట్ర ఎక్సైజ్ సాంస్కృతిక మరియు పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు.శనివారం మండల పరిధిలోని సంగినేనిపల్లి,గోపాల్ దీన్నే,రంగవరం,గోవర్ధనగిరి గ్రామాలలో అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేశారు.సంగినేనిపల్లిలో ఎస్సీ సబ్ ప్లాన్ ద్వారా 20 లక్షల రూపాయలతో చేపట్టనున్న సిసి రోడ్ల నిర్మాణానికి,ఐదు లక్షల రూపాయలతో జిల్లా పరిషత్ పాఠశాల కాంపౌండ్ నిర్మాణానికి,గోపాల్ దిన్నె గ్రామంలో సిసి రోడ్ల నిర్మాణానికి భూమి పూజ,20 లక్షల రూపాయలతో నిర్మించిన గ్రామపంచాయతీ భవనానికి శంకుస్థాపన చేశారు.రంగవరం గ్రామంలో సబ్ స్టేషన్ నిర్మాణానికి భూమి పూజ,80 లక్షల రూపాయలతో రంగవరం-నాగసానిపల్లి బీటి రోడ్డు నిర్మాణానికి భూమి పూజ,గోవర్ధనగిరి లో 90 లక్షల రూపాయలతో గోవర్ధనగిరి-రంగవరం బీటీ రోడ్డు నిర్మాణానికి భూమి పూజ చేశారు. అనంతరం గోపాల్దిన్నె రైతు వేదికలో ఏర్పాటు చేసిన సమావేశంలో గ్రామంలోని సమస్యలను సింగిల్ విండో మాజీ చైర్మన్ బాల్ రెడ్డి మాట్లాడుతూ 357 సర్వేనెంబర్ భూ సమస్యను పరిష్కరించాలని.అర్హులైన వారందరికీ రేషన్ కార్డులు,పింఛన్లు, ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలని.ఇప్పటికీ కొంతమంది రైతులకు రుణమాఫీ,రైతు భరోసా డబ్బులు రాలేదని మంత్రి జూపల్లి దృష్టికి తెచ్చారు.

మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందుతాయని,ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వం అర్హులైన ప్రతి రైతుకు రెండు లక్షల రూపాయల వరకు రుణమాఫీ చేయడం జరిగిందని,మూడు ఎకరాల లోపున రైతులందరికీ రైతు భరోసా డబ్బులను ఎకరాకు 6000 చొప్పున వారి వారి అకౌంట్లో జమ చేయడం జరిగిందని,ఈనెల చివరినాటికి రైతులందరికీ రైతు భరోసా డబ్బులు జమవుతాయని అన్నారు.500 కే గ్యాస్ సిలిండర్ రానివారు వారి పేర్లను పంచాయతి కార్యదర్శి ఇవ్వాలని వారికి కూడా పథకం వర్తించేలా చేస్తామని అన్నారు.నూతనంగా ఇల్లు నిర్మించుకునే వారికి,సిసి రోడ్ల నిర్మాణానికి ఇసుక లభించడం కష్టతరంగా ఉందని పలువురు సంగినేనిపల్లిలో మంత్రి జూపల్లి దృష్టికి తెచ్చారు.అక్రమంగా ఇసుక తరలింపు పై ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందని,ఇండ్ల నిర్మాణానికి, సిసి రోడ్ల నిర్మాణానికి ఇసుక కొరత రాకుండా అధికారుల దృష్టికి తీసుకు వెళ్తానని అన్నారు.ఎస్సీ సబ్ ప్లాన్,ఎన్ ఆర్ జి ఎస్ పథకాల ద్వారా గ్రామాలలో చేపట్టనున్న సిసి రోడ్లు నాణ్యతగా చేపట్టాలని పంచాయతీ అధికారులకు సూచించారు.ఇట్టి కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ చైర్మన్ గోవర్ధన్ సాగర్, పంచాయతీరాజ్ డిఇ అశోక్, ఏఈఈ లు విజయ్, మస్తాన్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు గోదల బీరయ్య, మండల రైతు బంధు సమితి మాజీ అధ్యక్షులు నారాయణరెడ్డి, వనపర్తి జిల్లా ఎంపీటీసీల ఫోరం మాజీ అధ్యక్షులు ఇంద్రకంటి వెంకటేష్,నాయకులు బొల్లారం సుదర్శన్ రెడ్డి,కొర్లకుంట గోపాల్ నాయక్, చక్ర వెంకటేష్, రామిరెడ్డి, చిన్నారెడ్డి, లోడుగు రాజు, రాంబాబు, ధనుంజయ,రవీందర్ రెడ్డి, మహేష్ నాయుడు,పెంటయ్య, వెంకటస్వామి, బుచ్చన్న,వెంకట్రాజయ్య, మోహన్ తదితరులు ఉన్నారు.

Leave A Reply

Your email address will not be published.