Take a fresh look at your lifestyle.

చేనేత కార్మికులు వైద్య శిబిరాలలో వైద్య పరీక్షలు చేయించుకోవాలి : స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కర్ రావు

ముద్ర, ఆలేరు :
జిల్లా లో ఉన్న చేనేత కార్మికులు, వారి కుటుంబ సభ్యులు వైద్య శిబిరాలలో వైద్య పరీక్షలు చేయించుకోవాలని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కర్ రావు అన్నారు.

గురువారం ఆలేరు పట్టణంలోని గౌడ సంఘ భవనంలో చేనేత కార్మికులకు “ఆరోగ్య భరోసా” కార్యక్రమాన్ని ఆలేరు మున్సిపల్ చైర్‌పర్సన్ బాలమణి భాస్కర్ ప్రారంభించారు. ఈ సందర్బంగా జిల్లా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ సూచనలతో, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా ఈ కార్యక్రమం చేపట్టడం జరిగిందన్నారు. చేనేత కార్మికులకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించి, అవసరమైన చికిత్సలు, ల్యాబ్ పరీక్షలు అందించారు. జిల్లా వైద్యాధికారి డాక్టర్ మనోహర్ మాట్లాడుతూ ఆరోగ్య సమస్యలు ఉన్నవారు ఈ అవకాశాన్ని వినియోగించుకుని చికిత్స తీసుకోవాలన్నారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ ఆంజనేయులు, డిఆర్ డిఏ పిడి నాగి రెడ్డి, శ్రీనివాస్, జిల్లా ప్రోగ్రాం అధికారులు, మునిసిపల్ కౌన్సిలర్లు, పట్టణ చేనేత సంఘం సభ్యులు, ఆరోగ్య సిబ్బంది, ఫీల్డ్ సిబ్బంది పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.