ఉపాధి హామీ పథకానికి ఉరేస్తున్న మోడీ ప్రభుత్వం : తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కొండమడుగు నర్సింహ్మ
ముద్ర, బీబీనగర్ :
వామపక్ష పార్టీలు, వ్యవసాయ కార్మిక సంఘాల పోరాటాల ఫలితంగా వచ్చిన మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి కేంద్రంలోని మోడీ ప్రభుత్వం ఉరేస్తూ కార్మికుల పోట్టగొడుతున్నాడని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కొండమడుగు నర్సింహ విమర్శించారు.
గురువారం బీబీనగర్ మండల పరిధిలోని ముగ్దంపల్లి గ్రామంలో ఉపాధి హామీ పని ప్రదేశాన్ని సందర్శించిన అనంతరం వారిని ఉద్దేశించి నర్సింహ మాట్లాడుతూ గ్రామీణ పేదల జీవన పరిస్థితుల్లో మార్పు తెచ్చి, రెండు పూటలా తిండి పెడుతున్న ఉపాధి హామీ పథకాన్ని రద్దుచేసి కూలీలు తింటున్న కంచాన్ని గుంజుకున్నట్టు మోడీ ప్రభుత్వం ప్రవర్తిస్తుందని అన్నారు. ఉపాధి హామీలో సంవత్సరానికి 200 రోజుల పని దినాలు కల్పించి, రోజు కూలీ 800 రూపాయలు ఇవ్వాలని, పని ప్రదేశంలో నీడ కోసం టెంట్, తాగడానికి నీళ్లు, మెడికల్ కిట్టు, ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. వీటి సాధన కోసం జిల్లా వ్యాప్తంగా అన్ని మండల ఎంపిడిఓ ఆఫీసుల ముందు ఈ నెల 20 నుండి 25 వరకు నిర్వహిస్తున్న ధర్నా కార్యక్రమాలలో కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొనాలని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం కార్మికులకు ఓ.ఆర్.ఎస్ ప్యాకెట్లు అందించినారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం మండల కన్వీనర్ గాడి శ్రీనివాస్, సిఐటియు మండల కన్వీనర్ బండారి శ్రావణ్ కుమార్, ఫీల్డ్ అసిస్టెంట్ నర్సింహ, కార్మికులు మట్ట పద్మ, వెంకటమ్మ, అంజమ్మ, మానస, సిలివేరు మంజుల , కవిత, గొరుకంటి అరుణ, క్రిష్ణవేణి, పద్మ, లలిత, గుండు యాదమ్మ పాల్గొన్నారు.