Take a fresh look at your lifestyle.

సాంప్రదాయ దుస్తులతో ఆలయాలకు వెళ్లాలి. -మోత్కూర్ మున్సిపల్ వైస్ చైర్మన్ పల్లెర్ల వెంకన్న గుప్తా.

ముద్ర, మోత్కూర్:
మోత్కూర్ మున్సిపాలిటీ పరిధిలోని అంగడి బజార్ లో గల శ్రీ అభయ వీరాంజనేయ స్వామి ఆలయానికి వచ్చే భక్తులకు మోత్కూర్ మున్సిపల్ వైస్ చైర్మన్ పల్లెర్ల వెంకన్న గుప్తా సుమారు 250 మంది భక్తులకు కాషాయం లుంగీ, టీ షర్టులను అందజేశారు. మంగళవారం శ్రీ అభయ వీరాంజనేయ స్వామి ఆలయంలో పారునంది సూరిబాబు శర్మ చేతుల మీదుగా భక్తులకు అందచేశారు.ఈ సందర్భంగా పురోహితుడు సూరిబాబు శర్మ మాట్లాడుతూ గుడికి సాంప్రదాయ దుస్తులతో వెళ్లాలి అనే భక్తి భావంతో కూడిన కార్యము వెంకన్న గుప్తా ముందుకు వచ్చి చేయడం చాలా శుభకరం అని అన్నారు.ఈ కార్యక్రమంలో భక్తులు బుస్సా రవి గుప్తా, శ్ పోచం కన్నయ్య, ఏలే నగేష్ జిట్ట నరేష్, జల్దీ సత్యనారాయణ, పుల్కరం వేణు, శివ చారి తదితర భక్తులు పాల్గొన్నారు

Leave A Reply

Your email address will not be published.