Take a fresh look at your lifestyle.

అనర్హులకు డబల్ బెడ్ రూమ్ ఇళ్లు – టి ఎఫ్ టి యు ఆధ్వర్యంలో ఆర్డీవో కార్యాలయం ఎదుట ఆందోళన

ముద్ర, ఉమ్మడి
మహబూబ్ నగర్ జిల్లా ప్రతినిధి:
…………………………………….
మహబూబ్ నగర్ పట్టణ సమీపంలో ఉన్న దివిటిపల్లి
గ్రామ శివారులో నిర్మించిన డబల్ బెడ్ రూము ఇళ్ల మంజూరు లో అవినీతి జరిగిందని టీ ఎఫ్ టీ యూ నాయకులు ఆరోపించారు. మంగళవారం స్థానిక ఆర్డీవో కార్యాలయం ఎదుట టి ఎఫ్ టి యు ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున డబల్ బెడ్ రూమ్ బాధితులు ఆందోళన కార్యక్రమం చేపట్టారు.
ఈ సందర్బంగా టి ఎఫ్ టి యు జిల్లా ఉపాధ్యక్షులు జి.గట్టన్న మాట్లాడుతూ దివిటి పల్లెలో డబల్ బెడ్రూంలో పరిశీలనకు వెళ్తే స్థానిక దళారులు అడ్డగించి దుర్భాషలాడుతున్నారన్నారు. అక్కడ కేటాయించిన ఇళ్లలో సుమారు 60 శాతం మంది అర్హులు కాని వాళ్ళు ఉన్నారని తెలిపారు. చాలామంది తమకు కేటాయించిన డబల్ బెడ్ రూమ్ లకు తాళాలు వేసి నివాసం ఉండటంలేదన్నారు.మరికొందరు వాటిని రెంటుకు ఇచ్చి సొంత ఇళ్లలో ఉంటున్నారన్నారు.
మరి కొన్ని ఇళ్లను కొందరు రాజకీయ అండతో ఆక్రమించుకున్నారని తెలిపారు.
సమాచార హక్కు చట్టాన్ని అనుసరించి వందలాది మంది దరఖాస్తులు పెట్టుకున్నా మహబూబ్ నగర్ అర్బన్ తాహసిల్దార్ కార్యాలయం నుంచి ఎలాంటి సమాధానాలు ఇవ్వడం లేదని విమర్శించారు. ఆర్టిఐ లెటర్లను అర్బన్ తాహసిల్దార్ కార్యాలయంలో తీసుకోవడం లేదని, వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. డబల్ బెడ్ రూమ్ ల మంజూరు లో రెవెన్యూ అధికారుల హస్తం ఉండడం వల్ల వాటి మీద విచారణ జరపడం కోసం రెవెన్యూ అధికారులు సిద్ధపడటం లేదని విమర్శించారు. పారదర్శకంగా విచారణ చేస్తే గతంలోbఅర్బన్ మండలంలో పనిచేసిన అనేక మంది రెవెన్యూ అధికారుల బండారంబయటపడుతుందన్నారు.అక్రమంగా డబల్ బెడ్ రూమ్ లు పొందిన వారిపై చర్యలు తీసుకోవాలని, వాటిని స్వాధీనం చేసుకొని అర్హులైన పేదలందరికీ ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. డబల్ బెడ్ రూంల అక్రమాలపై జ్యుడీషియల్ విచారణ జరపాలని డిమాండ్ చేశారు.మహబూబ్ నగర్ పట్టణంలో సుమారు 6,800 మంది సొంత ఇల్లు కానీ, ప్లాటు లేనివారు కిరాయి ఇళ్లలో జీవనం కొనసాగిస్తున్నారని తెలిపారు. వీరందరికీ డబల్ బెడ్ రూంలో ఇవ్వాలని, మహబూబ్ నగర్ పట్టణంలో 1013 ఎకరాల ప్రభుత్వ భూమి ఉందని, ప్రతి ఇల్లు లేని పేదవారికి 123 చదరపు గజాల భూమిని కేటాయించి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో టిఎఫ్టియు జిల్లా ఉపాధ్యక్షులు జలాల్ పాషా, డబల్ బెడ్ రూమ్ బాధితులు మాధవి, అనురాధ, విజయలక్ష్మి, దివ్య, హనీఫా బేగం, మొహమ్మద్ బషీర్, అబ్దుల్ రెహమాన్, శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు.
…………………………………..

Leave A Reply

Your email address will not be published.