ముద్ర, తాండూర్:
వికారాబాద్ జిల్లా తాండూర్ మున్సిపల్ పరిధిలోని 8వ వార్డ్ ఇందిరమ్మ కాలనీలో తాండూర్ మండల లీగల్ సర్వీస్ కమిటీ ఆధ్వర్యంలో న్యాయ విజ్ఞాన సదస్సు జరిగింది. ఇట్టి న్యాయ విజ్ఞాన సదస్సులో బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షులు న్యాయవాది మఠం చంద్రశేఖర్, న్యాయవాది జిలాని ఆధ్వర్యంలో జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. నేటి సమాజంలో ప్రతి వ్యక్తి కూడా చట్టం గురించి తెలుసుకోవాలని, ప్రజాస్వామ్య భారతదేశంలో ఎక్కడ అవినీతి, అన్యాయం, దోపిడి జరిగిన ప్రతి వ్యక్తికి ప్రశ్నించే అధికారం ఉందని, చట్టం ముందు ధనిక, బీద, తారతమ్యం లేకుండా అందరూ సమానులేనని, అందరికీ సమాన హక్కులు కల్పించడం జరిగిందని, వారు తెలిపారు. అదేవిధంగా ప్రభుత్వ ఆస్తులను కాపాడాల్సిన బాధ్యత ప్రతి పౌరుడుపై ఉందని, ఎవరైనా చట్టానికి లోబడి ఉండాలని, చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే చట్టం ముందు దోషిగా నిలబెట్టడం జరుగుతుందని వారు పేర్కొన్నారు. కార్యక్రమంలో కోర్టు సిబ్బంది, న్యాయవాదులు పాల్గొన్నారు.