Take a fresh look at your lifestyle.

వరి కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్ సంతోష్

  • అచ్చంపేట వ్యవసాయ మార్కెట్ యార్డ్ ను సందర్శించి, వరి ప్రక్రియను పరిశీలించిన, కొనుగోలు ప్రక్రియలో నిర్లక్ష్యంవహిస్తే కఠిన చర్యలు, జిల్లా కలెక్టర్ సంతోష్.

ముద్ర విలేఖరి,అచ్చంపేట: నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ శుక్రవారం అచ్చంపేట పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ యార్డుకు రైతులు తీసుకువచ్చిన వరి ధాన్యం కొనుగోలు ప్రక్రియను పరిశీలించారు.అకాల వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో మార్కెట్లో అధికారులు తీసుకుంటున్న జాగ్రత్తలను కలెక్టర్ పరిశీలించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అకాల వర్షాల ప్రభావం నుంచి ధాన్యాన్ని రక్షించేందుకు రైతులు టార్పాలిన్ కప్పి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.ఎక్కడైనా వర్షం వల్ల తడిసిన ధాన్యాన్ని ఆరబెట్టి, పాడి క్లీనర్ ద్వారా శుభ్రపరచి కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలని జిల్లా కలెక్టర్ సూచించారు.ఈ సందర్భంగా కలెక్టర్ కొనుగోలు కేంద్రాల నిర్వహణ, సిబ్బంది పనితీరు, ధాన్యం నాణ్యత, రైతుల అవసరాలు, డబ్బు చెల్లింపులు తదితర అంశాలను క్షుణ్ణంగా కలెక్టర్ పరిశీలించారు. ధాన్యాన్ని వేగవంతంగా మిల్లులకు తరలించాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు.హమాలీలు, లారీలను అదనంగా ఏర్పాటుచేసి ధాన్యాన్ని కొనుగోలు చేసిన వెంటనే ఎంపిక చేసిన మిల్లులకు తరలించాలని కలెక్టర్ ఆదేశించారు.వరి రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అధికారులు పకడ్బందీగా చర్యలు చేపట్టాలని సూచించారు.ఇప్పటివరకు రైతులతో కొనుగోలు చేసిన ధాన్యం వివరాలు, రైతులకు డబ్బుల చెల్లింపులను కలెక్టర్ అధికారులను అడిగి తెలుసుకున్నారు.కొనుగోలు ప్రక్రియలో అధికారులు నిర్లక్ష్యంగా వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో అచ్చంపేట ఆర్డిఓ మాధవి, , ఎమ్మార్వో చంద్రశేఖర్, డి ఎస్ డి ఓశ్రావణ్, హేమ్లా నాయక్ శాఖల అధికారులు ఉన్నారు.

Leave A Reply

Your email address will not be published.