Take a fresh look at your lifestyle.

వేసవి ఉపశమనం కేపీహెచ్‌బీ పోచమ్మ తల్లి ఆలయంలో ఉచిత మజ్జిగ పంపిణీ

ముద్ర కూకట్‌పల్లి :
భానుడి భగభగలతో అల్లాడుతున్న పాదచారులకు, ప్రజలకు ఉపశమనం కలిగించేందుకు కేపీహెచ్‌బీ కాలనీలోని జేఎన్‌టీయూ రోడ్డులో ఉన్న పోచమ్మ తల్లి దేవాలయ కమిటీ సభ్యులు అద్భుతమైన నిర్ణయం తీసుకున్నారు. ఎండ తీవ్రతను దృష్టిలో ఉంచుకుని ఆలయ ప్రాంగణంలో బాటసారులకు, భక్తులకు అపరిమిత ఉచిత మజ్జిగ పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు.
​దేవాలయ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో వేసవిభానుడి
​పెరుగుతున్న ఉష్ణోగ్రతల దృష్ట్యా సామాజిక బాధ్యతగా ఆలయ కమిటీ చేపట్టిన ఈ కార్యక్రమాన్ని స్థానికులు మరియు ప్రయాణికులు అభినందిస్తున్నారు. దప్పికతో అలమటించే వారికి ఈ మజ్జిగ ఎంతో ఊరటనిస్తోందని వారు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో
ఆలయ కమిటీ సభ్యులు బీఎస్‌ఎన్ రాజు, వుచ్చా రాంబాబు, నూతి రాంబాబు నాయుడు, తుంగల శ్రీను, అనిల్ తదితరులు స్వయంగా పాల్గొని ప్రజలకు చల్లని మజ్జిగను అందజేశారు.

Leave A Reply

Your email address will not be published.