- పాటించుకొని అధికారులు.
- విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్ష్యం.
- రైతులు భయాందోళనకు గురివుతున్నారు.
ముద్ర విలేకరి,గొల్లపల్లి: విద్యుత్ స్తంభం తో పాటు వైర్లు కిందికి వేలాడుతుండటంతో ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనని రైతులు భయాందోళన గురవుతున్నారు.జగిత్యాల జిల్లాలోని గొల్లపల్లి మండలం గోవిందుపల్లి గ్రామంలో వ్యవసాయ పొలంలో గత కొన్ని నెలల నుంచి విద్యుత్ స్తంభం వంగిపోయి ప్రమాదకరంగా మారిందని రైతులు తెలిపారు.అకాలవర్షాలు, ఈదురుగాలులతో స్తంభం కూలిపోతే పెద్ద ప్రమాదమే జరుగుతుందని ఆందోళన చెందుతున్నారు. విద్యుత్ స్తంభాలు వంగిపోయిన విద్యుత్ అధికారులు పట్టించుకోవటంలేదు.ప్రమాదాలు జరిగితే ఎవరూ బాధ్యులని రైతులు ప్రశ్నిస్తున్నారు.ఇప్పటికై నా అధికారులు స్పందించి వంగిపోయిన విద్యుత్ స్తంభాలను సరిచేయాలని వైర్లు కిందికి ఉండడంతో రైతులు అటువైపు పోవడానికి భయపడుతున్నారు.ఇప్పటికైనా విద్యుత్ అధికారులు స్పందించి వంగిన విద్యుత్ స్తంభాన్ని సరిచేసి కిందికి వేలాడుతున్న విద్యుత్ వైర్లను మరమ్మతు చేసి ప్రమాదాలు జరగక ముందే మరమ్మతులు చేపట్టాలని రైతులు పేర్కొంటున్నారు. విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్ష్యం ఫలితంగా ఈ దుస్థితి నెలకొందని రైతులు ఆరోపిస్తున్నారు.
