- ఎంపీడీవో రామకృష్ణకు కు వినతి.
ముద్ర విలేకరి,కోరుట్ల: కోరుట్ల మండల భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షుడు పంచిరీ విజయ్ కుమార్ ఆధ్వర్యంలో ఎంపీడీవో రామకృష్ణ కు వినతి పత్రం అందించారు.ఈ సందర్భంగా విజయ్ మాట్లాడుతూ ఇందిరమ్మ ఇళ్ల మంజూరి ప్రక్రియలో మండలంలోని ప్రతి గ్రామంలో, అర్హులైన నిరుపేద కుటుంబాలకు సమానంగా ఇందిరమ్మ ఇల్లు అందించే విధంగా చూడాలని ఎంపీడీవోకు విన్నవించారు.ఈ కార్యక్రమంలో మండల నాయకులు యూసుఫ్ నగర్ సర్పంచ్ గూగులోతు తుకారాం గౌడ్, అంబల్ల సుదర్శన్, దేవనపల్లి భూమానందం, శంకు నరేందర్, వెలేటి రాజు, గోపి, ప్రశాంత్, శ్రీపతి రెడ్డి, శేఖర్, కార్యకర్తలు పాల్గొన్నారు.