ముద్ర, వికారాబాద్ జిల్లా ప్రతినిధి :
ప్రపంచంతో పోటీపడేలా విద్యార్థులకు గుణాత్మకమైన అందించడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని శ్రీ సాయి విద్యానికేతన్ డైరెక్టర్ బసవరాజు గౌడ్ తెలిపారు.

సాయి విద్యానికేతన్ పాఠశాలలో 3వ వార్షికోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులకు సరియోధులకు జగ్గా సామర్థ్యాలను అందించేందుకు ఆటపాటలతో పాటు మంచి విద్యను అందించేందుకు సకాలంలో ఉపాధ్యాయులకు శిక్షణ ఇప్పిస్తున్నామని తద్వారా విద్యార్థులకు మంచి విద్యను బోధిస్తున్నామని తెలిపారు విద్యార్థులకు తక్కువ ఫీజుతో గుమ్మాత్మక విద్య అందేలా కృషి చేస్తున్నామని తెలిపారు వికారాబాద్ పట్టణంలో అతి తక్కువ ఫీజులతో ఉన్నతస్థాయి విద్యను అందించి అన్ని రంగాల్లో రాణించేందుకు ప్రత్యేక చదువుతూ బోధన చేపడుతున్నట్టు తెలిపారు. ఈ సందర్బంగా
విద్యార్థులు వివిధ రకాల నృత్యాలు, గేయాలు, నాటికలు సాంస్కృతిక కార్యక్రమాలతో ప్రేక్షకులను మంత్ర ముగ్ధులను చేశారు. ప్రతి ప్రదర్శన విద్యార్థుల ప్రతిభను ఆత్మవిశ్వాసాన్ని ప్రతిబింబించింది. ఈ విజయవంతమైన కార్యక్రమానికి పాఠశాల డైరెక్టర్ బస్వరాజ్ గౌడ్ మార్గదర్శకత్వం ప్రిన్సిపాల్ రవళి సమర్థ నాయకత్వం ముఖ్య కారణంగా నిలిచాయి. వారి ప్రోత్సాహం, ప్రణాళిక కృషితో ఈ వేడుకలు మరింత ఘనంగా నిలిచాయి.
ఉపాధ్యాయులు ఎంతో కృషి చేసి విద్యార్థులను సమర్థంగా తీర్చిదిద్దగా తల్లిదండ్రులు కూడా పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. విద్యార్థుల ప్రతిభను అభినందిస్తూ వారికి బహుమతులు ప్రదానం చేశారు. ఈ వేడుకలు అందరికీ మరపురాని అనుభూతిని అందించాయి.