*ప్రారంభోత్సవానికి చీఫ్ గెస్ట్ చంద్రబాబు నాయుడు*

అమరావతి, ఫిబ్రవరి 17: ఇండియన్ జర్నలిస్ట్స్ యూనియన్ (ఐజేయూ) 11వ మహాసభలు ( ప్లీనరీ) మార్చి రెండవ వారంలో విజయవాడలో జరుగుతాయి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు మహాసభలను ప్రారంభిస్తారు. ఐజేయూ అధ్యక్షుడు కే శ్రీనివాస్ రెడ్డి, కార్యదర్శి డి సోమసుందర్, ఆంధ్ర ప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (ఏపీయూడబ్ల్యూజే) అధ్యక్షుడు ఐ వి సుబ్బారావు మంగళవారంనాడు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుని అసెంబ్లీలోని ఆయన ఛాంబర్ లో కలిసి విజయవాడలో జరిగే ఐజేయూ ప్లీనరీకి ఆహ్వానించగా ఆయన దానికి అంగీకరించారు.
