Take a fresh look at your lifestyle.

పీఎన్ఆర్ కాలనీ వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షునిగా కొరిచర్ల


బోడుప్పల్, ముద్ర విలేకరి: బోడుప్పల్ నగర పాలక సంస్థ పరిధిలోని పీఎన్ఆర్ కాలనీ వెల్ఫేర్ సొసైటీ నూతన కార్యవర్గ అధ్యక్షునిగా కె.శ్రీనివాసరావు ఎన్నికయ్యారు. ఇటీవల జరిగిన కాలనీ నివాసితుల సర్వసభ్య సమావేశంలో ఈ మేరకు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కాలనీ వ్యవస్థాపక చైర్మన్ గా పి.దిలీప్ రెడ్డి, అధ్యక్షునిగా కొరిచర్ల శ్రీనివాసరావు, ఉపాధ్యక్షుడిగా ఎ.వెంకటేశం, ప్రధాన కార్యదర్శులుగా ఎస్.శ్రీకాంత్, ఎ.సందీప్, కోశాధికారిగా బి.శంకర్ గౌడ్, సంయుక్త కార్యదర్శిగా జె.ప్రకాశ్, కార్యనిర్వాహక కార్యదర్శులుగా రాజేష్, రమేష్, వి.మధు కుమార్, శేఖర్ లతో పాటు మహిళా ప్రతినిధులుగా కె.సరిత, కె.మాధవిలను ఎన్నుకున్నారు. కాలనీ సమస్యల పరిష్కారానికి కలిసికట్టుగా కృషి చేయాలని ఈ సందర్భంగా తీర్మానించారు.

Leave A Reply

Your email address will not be published.