బోడుప్పల్, ముద్ర విలేకరి
మహిళల అందానికే కాదు.. సౌభాగ్యానికీ చిహ్నం గాజులు… శక్తి స్వరూపిణి అయిన అమ్మవారి పూజలో కూడా పసుపు, కుంకుమలతో పాటు గాజులు పెట్టి పూజించడం మన సంప్రదాయం, ఆచారం. ముత్తయిదువులకి గాజులు ఇచ్చి గౌరవించే సంప్రదాయం మనది. మహిళలు వేసుకునే గాజులకి ఇంత విశిష్టత వుంది. మహాశక్తి స్వరూపిణి, ఒక్క పిలుపుతో భక్తజనావళి కోరిన కోర్కెలు తీర్చే కల్పవల్లిగా గుర్తింపు పొందిన శ్రీ మాతా నిమిషాంబికా తల్లి శ్రావణ మాసం చివరికి ఆదివారం సందర్భంగా లక్ష గాజులను అలంకరించుకుని భక్తులకు అభయమిచ్చింది.

బోడుప్పల్ లోని పెంటారెడ్డి కాలనీలో గల శ్రీ మాతా నిమిషాంబికా ఆలయం రంగు రంగుల గాజులలో శోభాయమానంగా ప్రకాశిస్తోంది. ఎరుపు, నీలం, ఉదారంగా, ఆకుపచ్చ, పసుపు, నారింజ, నలుపు, తెలుపు రంగుల గాజులతో అమ్మవారు దేదీప్య మానంగా ప్రకాశిస్తూ భక్తులకు దర్శనం ఇచ్చారు. మట్టిగాజులలో ఒక్కో రంగు గాజు ఒక్కో విశిష్టతకు చిహ్నంగా అమ్మవారు తన భక్తులకు శక్తిని, విజ్ఞానాన్ని, స్వేచ్ఛను, అదృష్టాన్ని, సంతోషాని, విజయాన్ని, ప్రశాంతతను, అధికారాన్ని కల్పిస్తూ ఆశీర్వదిస్తుందన్నది నమ్మకం. ఆదివారం ఉదయం నుంచి వేలాదిగా మహిళలు అమ్మవారిని దర్శనం చేసుకుంటున్నారు. భక్తులకు ఏవిధమైన అసౌకర్యం కలుగకుండా ఆలయ ధర్మకర్తల కమిటీ చర్యలు తీసుకుంది. ఆలయ ప్రధాన అర్చకులు చంద్రశేఖర శర్మ, ఉమాకాంత శర్మలు అమ్మవారికి ప్రత్యేక పూజాదికాలు నిర్వహించారు. ఆలయ చైర్మన్ కామరౌతు వినోద్ కుమార్, ప్రధాన కార్యదర్శులు కె.అశోక్ కుమార్, సంగు శ్రీనివాస్, కోశాధికారి ఎన్.రమేష్ , రాష్ట్ర నకాష్ సంఘం ప్రధాన కార్యదర్శి కొరిచెర్ల శ్రీనివాస్ రావులతో పాటు ధర్మకర్తలు ఎస్.గౌరీ శంకర్, డి.నర్సింగ్ రావు, ఎమ్.శ్రీనివాస్ రావు, ఎమ్.సాయి బాబా (శ్యామ్), బి.హిమచందర్, డి.సతీష్, రామగిరి శ్రీకాంత్, ఎన్.శ్రీకాంత్, ఎన్.రామకృష్ణ, వై.చంద్రశేఖర్, ఎన్.మోహన్, డి.రామక్రిష్ణ, ఎన్.శ్రీధర్, వెంకట్ రాజారావు, కె.ప్రవీణ్ కుమార్, డి.నరేష్, వై.సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.