Take a fresh look at your lifestyle.

బాలికల ఆరోగ్య రక్షణకు వైద్య శిబిరాలు విద్యార్థుల సంక్షేమంపై ప్రత్యేక దృష్టి కలెక్టర్ ప్రతిమా సింగ్

ముద్ర ప్రతినిధి, మెదక్:
బాలికల ఆరోగ్య రక్షణకు వైద్య శిబిరాలు ఏర్పాటు చేస్తు
విద్యార్థులపై ప్రత్యేక దృష్టి సారించినట్లు కలెక్టర్ ప్రతిమా సింగ్ అన్నారు. బుధవారం మెదక్ జిల్లా వెల్దుర్తి కస్తూరీబా గాంధీ బాలికల విద్యాలయం ఆకస్మికంగా సందర్శించారు. మెస్ నిర్వహణ, అల్పాహారం నాణ్యతను పరిశీలించారు. విద్యార్థులతో ముఖాముఖి సంభాషించి, వారికి అందుతున్న వసతులు, విద్యా బోధన, ఇతర సమస్యలపై ఆరా తీశారు. పప్పులు, బియ్యం, ఇతర నిత్యావసర సరుకుల నాణ్యతను తనిఖీ చేసి, మెరుగైన ప్రమాణాలను పాటించాలని సంబంధిత సిబ్బందికి సూచించారు.
వంట గదిలో ఉడికించిన అన్నం, కూరల నాణ్యతను క్షుణ్ణంగా పరిశీలించి, శుచిరుచికరమైన ఆహారాన్ని విద్యార్థులకు అందించడం పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. కలెక్టర్ మాట్లాడుతూ 99 రోజుల ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా కస్తూరిబా బాలికల విద్యాలయంలో ఆర్బిఎస్కే ఆరోగ్య శిబిరం నిర్వహించి బాలికల గైనకాలజీ సమస్యలకు చికిత్సలు అందించడంతోపాటు, బాలికల ఆరోగ్య పరిరక్షణపై అవగాహన కల్పిస్తున్నామన్నారు. శిబిరాల ద్వారా చిన్నపాటి ఆరోగ్య సమస్యలను ప్రాథమిక దశలోనే గుర్తించి, ఉచితంగా చికిత్స, అత్యున్నత వైద్య సేవలు అందిస్తున్నామన్నారు.
డి.సి.హెచ్.ఎస్ డా.శివదయాల్ మాట్లాడుతూ.. విద్యార్థుల్లో పౌష్టిక ఆహార లోపం, ఐరన్, విటమిన్, థైరాయిడ్, కంటి సమస్యలు, నెలసరి సమస్యలు గుర్తించి వారి పూర్తిస్థాయిలో చికిత్స అందించేందుకు ఈ శిబిరాన్ని ఏర్పాటు చేసినట్లు వివరించారు.
3 నెలల నిత్యావసర వస్తువుల పంపిణీలో పారదర్శకత
కౌడిపల్లి మండలంలోని కొట్టాల, వెల్మకన్నె గ్రామాల్లో చౌక ధరల దుకాణాలను కలెక్టర్ ప్రతిమా సింగ్ ఆకస్మిక తనిఖీ చేశారు. మూడు నెలల రేషన్ పంపిణీ విషయంలో పారదర్శకత, జవాబుదారుతనం పాటించాలని చెప్పారు. స్టాక్ పరిశీలించి లబ్ధిదారులతో మాట్లాడారు. చౌక ధరల దుకాణాలు సమర్థవంతంగా పనిచేయాలని  లబ్ధిదారులు ఎటువంటి అసౌకర్యం లేకుండా ప్రభుత్వ ఆదేశాల మేరకు కార్డులు కలిగిన ప్రతి కుటుంబానికి నిత్యావసర వస్తువుల పంపిణీ జరగాలని ఆమె ఆదేశించారు. వెంట జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి నిత్యానంద్, డిఎం సివిల్ సప్లై జగదీష్ తదితరులున్నారు.
సక్రమంగా సన్న బియ్యం సరఫరా
సక్రమంగా నాణ్యమైన సన్న బియ్యం సరఫరా చేయాలని కలెక్టర్ ప్రతిమా సింగ్ ఆదేశించారు. మెదక్ పట్టణంలో మార్కెట్ యార్డ్ దగ్గరగా ఉన్న ఎంఎల్ఎస్ పాయింట్ ను ఆకస్మికంగా తనిఖీ చేశారు.
ఎంఎల్‌ఎస్‌ పాయింట్‌ పరిధిలో పెండింగ్‌ ఉన్న రేషన్‌ షాపులకు బియ్యాన్ని త్వరగా సరఫరా చేయాలని సూచించారు. స్టాక్‌ రిజిస్టర్‌, ఇష్యూ రిజిస్టర్‌, గూడ్స్‌ రిజిస్టర్‌ రికార్డులను, ఆన్‌లైన్‌ రికార్డులను, వెయిం గ్‌ యంత్రాల రసీదులను పరిశీలించారు.
మూడు నెలల బియ్యం సరఫరా గురించి కలెక్టర్‌ ఆరా తీశారు. వెంట జిల్లా పౌర సరఫరాల సంస్థ మేనేజర్‌ జగదీష్, తహసీల్దార్‌ లక్ష్మణ్ బాబు తదితరులున్నారు.

Leave A Reply

Your email address will not be published.