ముద్ర ప్రతినిధి, జగిత్యాల: జగిత్యాల పట్టణం లోనీ జ్యోతి హైస్కూల్ ఐఐటీ అకాడమికి చెందిన విద్యార్థులు జాతీయ స్థాయి టెన్నిస్ క్రికెట్ పోటీలకు ఎంపిక అయినట్లు పాఠశాల డైరెక్టర్ బియ్యాల హరిచరన్ రావు తెలిపారు.టెన్నిస్ క్రికెట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో మహబూబాబాద్ లో జూన్ 21 నుంచి 23 నిర్వహించిన రాష్ట్ర స్థాయి 4వ తెలంగాణ టెన్నిస్ క్రికెట్ జూనియర్ బాయ్స్ అండ్ గర్ల్స్ ఛాంపియన్ షిప్ అండర్ 14 పోటీలలో జే. దీక్షిత్, జే . సుమంత్ , యం. విష్ణు, బి.సాయి నికేత్, అలాగే అండర్ 17 విభాగంలో ఈ . విశాల్, యం డి. వదూద్, ఎన్. సాత్విక్, బి. మెహర్ చంద్ర , అక్రమ్ లు పాల్గొని అత్యంత ప్రతిభ కనబరిచి జాతీయ స్థాయి పోటీలకు ఎంపికయ్యారు. జూలై 11 నుండి 13 వరకు ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరు లో నిర్వహించే జాతీయ స్థాయి క్రికెట్ పోటీలలో తెలంగాణ తరపున ప్రాతినిధ్యం వహించనున్నారు. జట్టు 15 మందిలో అండర్ 14 లో నలుగురు, అండర్ – 17 లో 5 గురు జ్యోతి హైస్కూల్ ఐఐటీ అకాడమీ నుండి ఉండటం జిల్లా కే గర్వకారణమని హరిచరన్ రావు పేర్కొన్నారు.ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో విద్యార్థులను అభినందించి జాతీయ స్థాయిలో ప్రతిభ చూపాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్స్ బోయినిపెళ్లి శ్రీధర్ రావు, మౌనిక రావు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
