Take a fresh look at your lifestyle.

ఆర్టీసీ కార్మికుల సమ్మెకు మద్దతు తెలిపిన కోరుట్ల బీజేపీ నాయకులు 

 

 

ముద్ర, కోరుట్ల;

ఆర్టీసీ కార్మికుల హక్కుల కోసం ఆత్మ బలిదానం చేసుకున్న శంకర్ గౌడ్ కుటుంబానికి 5 కోట్లు ఎక్స్ గ్రేషియా ప్రకటించాలి. కోరుట్ల పట్టణం లోని బస్టాండ్ సమీపంలో ఆర్టీసీ కార్మికులు తమ హక్కులు, వేతనాల పెంపు, ఉద్యోగ భద్రత, మరియు ఇతర సంక్షేమ అంశాల కోసం చేస్తున్న సమ్మెకు బీజేపీ జగిత్యాల జిల్లా అధ్యక్షుడు యాదగిరి బాబు, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు డాక్టర్ వై. అనూప్ రావు, ఓబీసీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షుడు రుద్ర శ్రీనివాస్, పట్టణ అధ్యక్షుడు కస్తూరి లక్ష్మినారాయణ నిజామాబాద్ పార్లమెంట్ కన్వీనర్ గుంటుక సదశివ్  సంఘీభావం తెలిపారు. ప్రధానంగా ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం, యూనియన్ల పునరుద్ధరణ, పెండింగ్ పిఆర్సీలు అలాగే 32 డిమాండ్ల పైన మరియు ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ఆర్టీసీ గురించి పెట్టిన అంశాలను నెరవేర్చమని ప్రభుత్వానికి సమ్మె నోటీస్ ఇవ్వడం జరిగింది. జేఏసీ తలపెట్టిన డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించే వరకు మీ పక్షాన బిజెపి మీ వెన్నంటే ఉంటుందని హామీ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ కార్మికులు, బీజేపీ పార్టీ కార్యకర్తలు, నేతలు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.