Take a fresh look at your lifestyle.

పెబ్బేరు సంత స్థలంపై ఈగ వాళ్ళనివ్వం దోచేయాలని చూసి నేడు నీతి మాటలు మాట్లాడడం విడ్డూరం Mla మేఘారెడ్డి

ముద్ర, వనపర్తి :
వనపర్తి చరిత్రలో సురవరం నుంచి మొదలు పెడితే చివరిగా చిన్నారెడ్డి వరకు ఎమ్మెల్యేలంతా తులసి మొక్కలుగా పూజింపబడితే, పదేళ్ల నియంత పాలన చేసిన ఒకే ఒక్కడు మాత్రం గంజాయి మొక్కల తయారయ్యాడని,
అలాంటి గంజాయి మొక్కను పీకి అవతల పడేయాలని వనపర్తిని కాపాడుకుందాంఅని 2023 లో జరిగిన ఎన్నికల్లో ప్రజలను కోరితే పీకి అవతల పరేశారని వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘారెడ్డి తీవ్రంగా ఆరోపించారు. ఆదివారం వనపర్తి కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన పత్రిక సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు.
ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి గత 5 సంవత్సరాలు అధికారం అప్పగిస్తే పాలకుండ దగ్గర దొంగ పిల్లిని కాపలా పెట్టినట్లు నియోజకవర్గంలోని సంపదనంత దోచుకున్నాడని ఆయన విమర్శించారు. ప్రస్తుతం జరిగిన ఎమ్మెల్యే, ఎంపీ, గ్రామ సర్పంచ్, మున్సిపల్ కౌన్సిలర్ల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అఖండ మెజారిటీ సాధించిందని, ఆ రిజల్ట్స్ తో మైండ్ దొబ్బి కొంతమంది రండలు పిచ్చిపిచ్చిగా మాట్లాడు తున్నారని అన్నారు.
నియంత పాలన నడిచిన రోజునే ఎక్కడ భయపడ లేదని తాను గుండు సూదితో గుచ్చితే నేను గడ్డపారతో కుచ్చుతానని బాహాటంగా చెప్పి మరి చేశామని ఎమ్మెల్యే అన్నారు. ఇప్పటికీ అదే స్టాండ్ మీద ఉన్నామని ఆయన చెప్పారు. తామెప్పుడు ఎవరిని అగౌరపరిచే విధంగా మాట్లాడలేదని, కొందరు వెధవలకు వాళ్ళ భాషలోనే చెబితేనే అర్థం అయ్యేటట్లు ఉందని నేడు ఈ విధంగా మాట్లాడవలసి వస్తుందని ఆయన అన్నారు.
పెబ్బేరు సంత స్థలంలో పూజారుల తరఫున న్యాయవాదిని తానేనని ఒప్పుకోవడం జరిగిందన్నారు.
100 సంవత్సరాలుగా వేణుగోపాల స్వామి ఆలయానికి సంబంధించిన ఈనామ్ భూమి అది అని అందరికీ తెలుసునని, అప్పటినుంచి ఇప్పటివరకు సంత ప్రశాంతంగా కొనసాగిందన్నారు.1973 లో ఒక ప్రొసీడింగ్ వచ్చిందని 392 సర్వే నెంబర్లు 15 ఎకరాలు, సర్వేనెంబర్ 405 లో 15 ఎకరాల భూమి మొత్తం 30 ఎకరాల 19 గుంటలు వేణుగోపాల స్వామి దేవుడిపై ఆయన దూపదీప నైవేద్యాల కోసం కేటాయించ బడిందన్నారు. ఆ గుడి ద్వారా వచ్చే ఆదాయంతో పూజారులు వాళ్ళ జీవనాన్ని కొనసాగించేందుకు కేటాయించారు అని అన్నారు. తదనంతరం వేణుగోపాల స్వామి ఆలయానికి సంబంధించిన రిజిస్టర్లలోని కాస్ర పహానిలో దేవుడు వేణుగోపాల స్వామిని మనిషి వేణుగోపాలస్వామిగా చిత్రీకరించి రాశారని అది చేసిన ఎవరు చేసిండ్రు ప్రజలకు అర్థమై పోతుందన్నారు. పూజార్ల తరపు న్యాయవాదికి పూర్తిగా తెలుసునని విమర్శించారు.
ఈ భూమికి సంబంధించి మహబూబ్ నగర్, గద్వాల ఆర్డివోలు సైతం ఈ భూమి పూర్తిగా వేణు గోపాల స్వామి ఆలయానికి సంబంధించింది అని సూచిస్తూ ప్రభుత్వా పరమైన ప్రోసిడింగ్ ఇవ్వడం జరిగిందన్నారు. ఈ క్రమంలో గత 30, 40 సంవత్సరాలుగా ఎంతో ప్రశాంతంగా కొనసాగిన పెబ్బేరు సంత 2014 వరకు ఎంతో ప్రశాంతంగా కొనసాగిందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. 100 సంవత్సరాలుగా ప్రశాంతంగా ఉన్న ఆ సంతస్థలం ఈ గంజాయి మొక్కకు ప్లానింగ్ బోర్డ్ వైస్ చైర్మన్ పదవి రాగానే వివాదాస్పదంగా మార్చారని ఆయన పేర్కొన్నారు. ఈయన అధికారంలో ఉన్న సమయం లోనే విభాగంగా మారిందని ఆయన విమర్శించారు.
ఈ విషయాలన్నీ పెబ్బేరు ప్రజలకు తెలుసునని ఆయన అన్నారు. ఆలయ పూజారుల అడ్వకేటునైన నేనే ఈ సమస్యను పరిష్కరిస్తానని 12 నుంచి 15 ఎకరాలలో సంతకు సరిపోతుందని మిగతాది పూజారుల పేరు మీద చేద్దామని ఒక ప్లాన్ ప్రకారంగా ఆ స్థలాన్ని దొబ్బేసేందుకు వ్యూహాలు రచించారన్నారు. ఈ క్రమంలో గిఫ్ట్ డిడి కింద రిజిస్ట్రేషన్ చేసేది ఉంటే అది పెబ్బేరు మున్సిపల్ పేరున చేయాల్సి ఉంటుంది కానీ ఆయన అలా చేయలేదు, మళ్లీ నేనే గెలుస్తానని, అప్పుడు ఈ స్థలాన్ని దొబ్బియొచ్చని పెబ్బేరు ఎమ్మార్వో పై రిజిస్ట్రేషన్ చేయించారు అని ఆరోపించారు. ఈ క్రమంలో పూజారులకు గిఫ్ట్ డిడి కింద మండల పరిధిలో ఎక్కడైనా దానికి సరితూగే స్థలాన్ని సూచించాలన్నదే దాని ఉద్దేశం అన్నారు. అయితే అప్పటికే పదవిలో ఉన్న ఆయన ఏడు నెలలు తన పదవీకాలం ఉన్న రాష్ట్రంలోనే నెంబర్ ఫోర్ అనీ చెప్పుకునే తనకి వారికి ఆల్టర్నేట్ ల్యాండ్ చూయించేందుకు సమయం లేకపోవడం విడ్డూరం అన్నారు. అట్లా చెయ్యకపోగా కలెక్టర్ స్థాయి ఉన్నతాధికారు లపై పెత్తనంచేలాయించి ఆపించిందే కాక రాత్రికి రాత్రి కలెక్టర్ ట్రాన్స్ఫర్ చేసిన ఘనత ఈ ప్రబుద్ధుడిదని ఆయన ఎద్దేవా చేశారు.
తమకు అనుకూలంగా ఉన్న అధికారులకు అడిషనల్ కలెక్టర్ గా పదవులను కట్టబెట్టి వీరు స్థలానికి సంబంధించిన ప్రోసిడికులు పొందారని, అందుకు సంబంధించిన ఎ విడెన్సులన్నీ తన దగ్గర ఉన్నాయని ఎమ్మెల్యే చెప్పారు. ఎన్నికల సమయంలో తాము చెప్పిన మాటకు ఇప్పటికీ కట్టుబడి ఉన్నామని, సంత స్థలానికి సంబంధించి 30 సంవత్సరాల నుంచి దేవదాయ శాఖ కోర్టును ఆశ్రయించిందని ఇంకా దేవదాయ శాఖకు మధ్యల ఇందుకు సంబంధించిన సమస్య కొనసాగుతూనే ఉందని ఆయన అన్నారు. సంత స్థలాన్ని కాపాడుకుంటామని చెప్పి నేటికీ అందులో ఎవరి చేయి పెట్టకుండా చూసిన ఘనత తమదేనని ఎమ్మెల్యే అన్నారు.పూజారుల తరఫున న్యాయవాదివి నువ్వే కదా పూజారులకు దక్కింది అని కోర్టు చెప్పిందని, చెబు తున్నారు కదా మరి మీరు పొజిషన్లకు ఎందుకు పోతలేరో చెప్పాలని ఎమ్మెల్యే ప్రశ్నించారు. తాను ఎమ్మెల్యే అయిన తర్వాత 2024 లో సంతస్థలం సంత కెటాయించాలని కోరుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి లెటర్ రాశారని ఇందుకు సంబంధించి రెవెన్యూ శాఖ మంత్రి కూడా జిల్లా కలెక్టర్ కు ఆదేశాలు జారీ చేసి ఉన్నారని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఈ క్రమంలో పొజిషన్ను పూజారులే ఉంటే దేవదాయ శాఖతో మాట్లాడి ఇందుకు సంబంధించిన సమస్యను పరిష్కరించేలా చూడాలని కలెక్టర్లను ఆదేశించినట్లు ఆయన చెప్పారు. ఇదిలా నడుస్తుండగానే ఎమ్మెల్యేగా తానే పూజార్ల వద్దకు వెళ్లి సమస్య పరిష్కారానికి ప్రయత్నిద్దామని వెళ్లే క్రమంలో
ఈ పాలకాడి పిల్లి ఆయన పూజారి తరుపు అడ్వకేట్ ఎమ్మెల్యేకు సహకరించొద్దని, మెసేజ్లు పెట్టిన దరిద్రుడు సంతపై మాట్లాడడం సిగ్గుచేటు అన్నారు. మెసేజ్లు పెట్టలేదని తడి బట్టలతో వేణుగోపాల స్వామి గుడిలోకి వచ్చి ప్రమాణం చేయాలని నేనైనా వస్తానని ఎమ్మెల్యే సవాలు విసిరారు.ఇది జరిగిన ఆరు నెలల తర్వాత స్థల ఓనర్లమని ఎవరైతే చెబుతున్నారో వారు మాకు ఈ 15 ఎకరాలకు బదులుగా హైదరాబాద్ పట్టణ శివారులో ఎక్కడైనా స్థలం కేటాయించమని కోరుతూ లెటర్ రాశారని ఎమ్మెల్యే చెప్పారు. మరి వారి తరఫున ఒకాలత్ పుచ్చుకున్న అడ్వకేట్ నువ్వే కదా మరి లెటర్ ఎందుకు రాయాల్సి వచ్చిందని ఎమ్మెల్యే ప్రశ్నించారు. వారు రాసిన లెటర్ ఆధారంగానే దాన్ని బేస్ చేసుకుని నేను నా లెటర్ ఐడి పై అదే విషయాన్ని ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుపోయినట్టు ఎమ్మెల్యే చెప్పారు. దాంతో ప్రస్తుతం ఉన్న కలెక్టర్ పెబ్బేరు పరిధిలో ఎక్కడైనా స్థలం చూసి గిఫ్ట్ డిడికి తగ్గట్టుగా ల్యాండ్ కేటాయించడానికి చూస్తున్నట్లు ఎమ్మెల్యే చెప్పారు. మిగతా స్థలానికి సంబంధించిన విలువ 22 కోట్ల రూపాయలను ప్రభుత్వం తరఫున వస్తే అది ఎవరికీ ఇవ్వాలని మరో సందిగ్గం నెలకొన్నట్టు ఎమ్మెల్యే తెలిపారు. కోర్టులో ఉన్న వ్యాజ్యం పరిష్కారమైన నాడు ఎవరికి స్థలం వస్తే వారికి అమౌంట్ అందజేద్దామని చెప్పినట్లు ఎమ్మెల్యే పేర్కొన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేనారెడ్డి, వ్యవసాయ మార్కెట్ యార్డ్ అధ్యక్షులు శ్రీనివాస్ గౌడ్, మున్సిపల్ చైర్మన్ మాధవి రమేష్, వైస్ చైర్మన్ మధుసూదన్ గౌడ్, టీపీసీసీ జర్నల్ సెక్రెటరీ నందిమల్ల యాదయ్య, తిరుపతయ్య, పీసీసీ సభ్యులు శంకర్ ప్రసాద్, పట్టణ మున్సిపల్ కౌన్సిలర్లు మాజీ కౌన్సిలర్లు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.