Take a fresh look at your lifestyle.

దుబ్బాక సమస్యలు పరిష్కరించండి మేదక్ ఎంపీ రఘునందన్ రావు

 

ముద్ర ప్రతినిధి, సిద్దిపేట :
సిద్దిపేట జిల్లా నర్మెట్ట గ్రామంలో ముఖ్యమంత్రి పర్యటనలో 8 ముఖ్యాంశాలతో సీఎం రేవంత్ రెడ్డి కి మెదక్ ఎంపీ రఘునందన్ రావు వినతి పత్రం ఇచ్చారు.
గజ్వేల్ లో అసంపూర్తిగా ఉన్న రింగ్ రోడ్డును వెంటనే పూర్తి చేయాలని విజ్ఞప్తి చేశారు.
మల్లన్న సాగర్ ప్రాజెక్ట్ లో దుబ్బాక శాసనసభ నియోజకవర్గ పరిధిలో అన్ని గ్రామాలకు కాలువల ద్వారా నీళ్లు అందించాలన్నారు.
తపాస్ పల్లి రిజర్వాయర్ నుంచి కొండపాక మండలంలోని ఎనిమిది గ్రామాలకు నీళ్లు అందించాలన్నారు. 765 డిజి జాతీయ రహదారి హబ్సిపూర్ నుంచి దుబ్బాక అంబేద్కర్ విగ్రహం వరకు నాలుగు లైన్ల రోడ్డు వేయాలని కోరారు.
ఎనగుర్తి చౌరస్తా నుంచి బొప్పాపూర్ మీదుగా శిలాజీ నగర్ కు డబుల్ రోడ్డు మంజూరు చేయాలన్నారు. కొండపాక మండల కేంద్రంలో కొత్త పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేయాలన్నారు.
మెదక్ జిల్లా, సంగారెడ్డి జిల్లాలో ఆయిల్ ఫామ్ కంపెనీల ఏర్పాటు వెంటనే చేయాలని వినతి చేశారు. ఈ సందర్బంగా సీఎం రేవంత్ రెడ్డి సానుకూలంగా స్పందించారు.

Leave A Reply

Your email address will not be published.