మంథని, ముద్ర విలేకరి : లయన్స్ క్లబ్ విజన్ కేర్ 2025-26 సంవత్సరానికి గాను నూతన కార్యవర్గంను లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ 320జీ మొదటి గవర్నర్ లయన్ మోర భద్రేశం ఆధ్వర్యంలో లయన్స్ భవన్ మంచిర్యాల లో ప్రమాణస్వీకారం చేయించారు.లయన్స్ క్లబ్ విజన్ కేర్ అధ్యక్షులుగా లయన్ బుద్దార్తి సతీష్ కుమార్,కార్యదర్శిగా లయన్ అబ్దుల్ వాసే,కోశాధికారిగా లయన్ షేక్ అలీం ప్రమాణ స్వీకారం చేశారు.ఈ సందర్భంగా లయన్స్ క్లబ్ విజన్ కేర్ అధ్యక్షులు లయన్ బుద్దార్తి సతీష్ కుమార్ మాట్లాడుతూ సమాజ సేవా కార్యక్రమంలో ముందుండి మంథని పరిసర గ్రామాలకు సేవా కార్యక్రమాలు అందిస్తామని తెలిపారు.మన దగ్గర ఉన్న పేదవారికి ఉచిత రవాణా భోజన వసతులు కల్పిస్తూ ఉచిత కంటి శస్త్ర చికిత్సలు నిర్వహించి అన్ని విధాలుగా సహకారం అందిస్తామని తెలిపారు. తమ ఎన్నికకు సహకరించిన వ్యవస్థాపక అధ్యక్షులు లయన్ పూదరి దత్తాగౌడ్ కు సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం మొదటి గవర్నర్ లయన్ మోర భద్రేశం మాట్లాడుతూ సేవ చేయాలనే వారికి లయన్స్ క్లబ్ మంచి వేధికగా ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో లయన్ ఇనుగుర్తి రమేష్,లయన్ కట్కూరి సత్యనారాయణ, జోన్ చైర్మన్ లయన్ బొమ్మ బాపు రెడ్డి,రీజియన్ ఛైర్మన్ లయన్ దేవులపల్లి రాజయ్య,పూర్వ అధ్యక్షులు లయన్ సయ్యద్ ఇలియజ్ పాల్గొన్నారు.