Take a fresh look at your lifestyle.

పదవ తరగతి ఫలితాల్లో మంథని కాకతీయ ప్రభంజనం

మంథని, ముద్ర :మంథని లోని కాకతీయ హై స్కూల్ లో బుధవారం ప్రభుత్వం విడుదల ఎస్ఎస్సి ఫలితాల్లో ప్రభంజనం సృష్టించింది. పాఠశాలలో మొత్తము 42 మంది విద్యార్థిని విద్యార్థులు పరీక్షకు హాజరుకాగా 100% ఫలితాలు సాధించారు. ఈ ఫలితాలలో దుర్గం త్రేక్ష 579/600 మార్కులు సాధించి మండలంలోని టాపర్గా నిలిచింది. భాసాని సిరి వర్షిని 567/600 మార్కు సాధించి పాఠశాలలో రెండవ ర్యాంకు సాధించింది. అదేవిధంగా పాఠశాల ఫలితాల్లో 500 కు పైగా 22 మంది విద్యార్థులు సాధించారు. అత్యధిక మార్కులు సాధించిన దుర్గం తెక్ష మరియు భాసాని శ్రీ వర్షిని పాఠశాల ప్రిన్సిపల్ ప్రదీప్ రెడ్డి అభినందించారు. గతంలో చెప్పినట్లుగా గత నాలుగు సంవత్సరాల నుంచి మంథని మండలంలో కాకతీయ పాఠశాల టాపర్గా నిలుస్తూ ఉంది. అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థిని విద్యార్థులను పోషకులను సహకరించిన ఉపాధ్యాయిని ఉపాధ్యాయులను ప్రిన్సిపల్ ప్రదీప్ రెడ్డి ,డైరెక్టర్లు రవి కిరణ్ రెడ్డి ,శ్రావణ్ రెడ్డి, స్రవంతి,పావనీలు అభినందించారు.

Leave A Reply

Your email address will not be published.