వికారాబాద్, ముద్ర విలేకరి : వికారాబాద్ జిల్లా పూడూరు మండలం దామగుండం అటవీ ప్రాంతంలో ఓ జింక కుక్కల దాడిలో గాయపడి మృతి చెందింది. గ్రామాలలో కుక్కల బెడద తీవ్రంగా ఉందని కుక్కలు కారణంగా మనుషులపై దాడి చేసి కరుస్తున్నాయని పూడూరు మండల పరిసర గ్రామాల ప్రజలు వాపోతున్నారు. అటవీ ప్రాంతంలో కుక్కలు ఇష్టారాజ్యంగా తిరుగుతూ జంతువుల పై దాడి చేసి కరుస్తున్నాయని, ఇలాంటి సంఘటనలు గతంలోనూ పలుమార్లు చోటు చేసుకున్నాయని తెలిపారు.వికారాబాద్ జిల్లా కేంద్రం అనంతగిరి అటవి ప్రాంతంలోనూ ఇలాంటి కుక్కల దాడుల ఘటనలు పలుమార్లు చోటుచేసుకున్నాయని, కుక్కల దాడిలో ఇదివరకు రెండు మూడు జింకలు ఉతివాదపడ్డాయని తెలిపారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా అటవీశాఖ అధికారులు తగు చర్యలు తీసుకోవాలని కోరారు.