Take a fresh look at your lifestyle.

అంబీర్ చెరువు అభివృద్ధి కోసం సైబరాబాద్ కమిషనర్‌కు వినతిపత్రం

 

హైదరాబాద్ ముద్ర కూకట్‌పల్లి: ప్రగతి నగర్‌లో ఉన్న అంబీర్ చెరువు సమగ్ర అభివృద్ధి కోసం లేక్ వ్యూ కాలనీ, ఆదిత్య నగర్ కాలనీతో పాటు పరిసర ప్రాంతాల నివాసులు కలిసి సైబరాబాద్ కమిషనర్ శ్రీమతి సృజన ఐఏఎస్ కు వినతిపత్రం సమర్పించారు.

స్థానికులు వివరించిన సమస్యలను కమిషనర్ శ్రద్ధగా ఆలకించి, అంబీర్ చెరువు అభివృద్ధి కోసం తన వంతు సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. అదేవిధంగా, చెరువును స్వయంగా సందర్శించి పరిస్థితులను పరిశీలిస్తామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో స్థానిక అంబీర్ లేక్ వాకర్స్ అసోసియేషన్, మరియు ఆదిత్య నగర్ ప్రతినిధులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.