Take a fresh look at your lifestyle.

పురపాలక ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం ప్రజాపాలనకు ప్రజామోదం : మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

 

ప్రజాపాలనకు ప్రజామొదం
#అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు పట్టం కట్టారు
#సన్న బియ్యం పంపిణీతో సంచలన విజయాలు నమోదు
#తెల్ల రేషన్ కార్డుల మంజూరుతో పేదల కళ్ళలో వెలుగులు

పురపాలక సంఘం ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సాధించిన విజయాలు రాష్ట్ర ప్రభుత్వ పనితీరును ప్రతిబింబింప చేస్తుందని రాష్ట్ర నీటిపారుదల,పౌర సరఫరాల శాఖామంత్రి కెప్టెన్ ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు.

కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేపట్టిన విప్లవాత్మక సన్నబియ్యం పంపిణీ ఈ ఎన్నికల్లో గేమ్ చెంజర్ గా మారిందని ఆయన చెప్పారు.

పురపాలక సంఘాల ఎన్నికల ఫలితాలు వెలువడిన అనంతరం ఆయన స్పందిస్తూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక జరుగుతున్న అభివృద్ధి, అంలౌతున్న సంక్షేమ పథకాలకు ప్రజామోదం లభించినట్లైందని ఆయన అన్నారు.

అర్హులైన నిరుపేదలకు తెల్ల రేషన్ కార్డుల పంపిణీతో పాటు రాష్ట్ర జనాభాలో 85% ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా అందిస్తున్న నాణ్యమైన సన్న బియ్యం పంపిణీ వట్టి ప్రతిష్టాత్మక కార్యక్రమాలతో పాటు మహిళలకు ఉచిత బస్ ప్రయాణం ఇందిరమ్మ ఇళ్ళు,అర్హులైన నిరుపేద మధ్యతరగతి వర్గాలకు ప్రభుత్వం ఉచితంగా సరఫరా చేస్తున్న 200 యూనిట్ల విద్యుత్ సరఫరా వంటి పధకాలు పురపాలక సంఘం ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయానికి దోహదం చేశాయన్నారు.

వీటన్నింటిని మించి సాగునీటి రంగంలో సాధించిన విజయాలు,యావత్ భారతదేశ చరిత్రలోనే రికార్డ్ స్థాయిలో ధాన్యం దిగుబడులు, అదే స్థాయిలో కొనుగోళ్ల ప్రక్రియతో పాటు రైతాంగానికి అనుకూలంగా రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేశాయన్నారు.

మొత్తంగా రాష్ట్ర ప్రభుత్వం పనితీరుకు పట్టణ ప్రజలు ఆమోదించి పట్టం కట్టారన్నారు.

పురపాలక సంఘం ఎన్నికల్లో ఫలితాలు ముందుగా ఊహించినవేనని,యావత్ తెలంగాణా సమాజం కాంగ్రెస్ పార్టీ వెంట నడుస్తోందనడానికి ఈ ఎన్నికల అద్దం పడుతున్నాయన్నారు.

పల్లెలతో పాటు పట్టణాలు సైతం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ పనితీరుపై ప్రజలిచ్చిన తీర్పు గా ఆయన అభివర్ణించారు.

తాను ప్రాతినిధ్యం వహిస్తున్న హుజుర్నగర్ నియోజకవర్గ పరిధిలోని హుజుర్నగర్,నేరేడుచర్లతో పాటు కోదాడ,సూర్యాపేట పురపాలక సంఘాల ఎన్నికల ఫలితాలపై ఆయన స్పందిస్తూ సూర్యాపేట జిల్లా కాంగ్రెస్ పార్టీకీ కంచుకోట అని మరోమారు రుజువైనందన్నారు.

ఈ విజయం పూర్తిగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల కష్టంతో సాధించిందని అందుకు తోడ్పాటునందించిన ఆయా పురపాలక సంఘాల ఓటర్లకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

2023 లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో సూర్యాపేట జిల్లాలో కాంగ్రెస్ పార్టీ సాధించిన సంచలన విజయాల వరవడి ఆ తరువాత జరిగిన లోకసభ ఎన్నికల్లో ఇటీవల జరిగిన గ్రామపంచాయతీ ఎన్నికల్లో తాజాగా జరిగిన పురపాలక సంఘాల ఎన్నికల్లోనూ కొనసాగిందని ఆయన వ్యాఖ్యానించారు.

లోకసభ ఎన్నికల్లో సూర్యాపేట జిల్లాలోనీ తుంగతుర్తి, సూర్యాపేట,కోదాడ,హుజుర్నగర్ నియోజకవర్గలలో కాంగ్రెస్ పార్టీ సాధించిన ఓట్లు భారతదేశ చరిత్రలోనే ప్రత్యేక రికార్డ్ గా నమోదు అయిందని ఆయన గుర్తు చేశారు.

ప్రస్తుతం జరిగిన పురపాలక సంఘం ఎన్నికల ఫలితాలు మరోసారి సూర్యాపేట జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి తిరుగు లేదని నిరూపించారని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు.

Leave A Reply

Your email address will not be published.