Take a fresh look at your lifestyle.

​ఓం శాంతి బోధనలు మానవాళికే ఆదర్శం: బండి రమేష్

ముద్ర కూకట్‌పల్లి : ఓం శాంతి సంస్థ అందిస్తున్న శాంతి, సహనం మరియు ప్రేమ బోధనలు మతాలకు, ప్రాంతాలకు అతీతంగా ప్రపంచ మానవాళికి అనుసరణీయమని టిపిసిసి ఉపాధ్యక్షుడు, కూకట్‌పల్లి కాంగ్రెస్ ఇంచార్జ్ బండి రమేష్ పేర్కొన్నారు.
​ఓం శాంతి సంస్థ కార్యాలయంలో నిర్వహించిన ‘సుప్రీం పీస్ డిజిటల్ వెల్నెస్ విజువల్ మెడిటేషన్ స్పిర్చువల్ సెషన్’ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. లక్షలాది మంది ఈ సంస్థ ద్వారా మానసిక ప్రశాంతత పొందుతున్నారని కొనియాడారు.రాజస్థాన్‌లోని మౌంట్ అబూ తర్వాత హైదరాబాద్‌లో ఈ సంస్థ ఇంతగా విస్తరించడానికి నాటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్థల కేటాయింపు, భవన నిర్మాణంలో అందించిన సహకారం మరువలేనిదని గుర్తుచేశారు.
​తెలుగు రాష్ట్రాల్లో సంస్థ ఎదుగుదలకు నాటి నుంచి నేటి వరకు అందరు ముఖ్యమంత్రులు తమ వంతు కృషి చేశారని రమేష్ పేర్కొన్నారు.
​ఈ కార్యక్రమంలో సంస్థ ప్రతినిధులు కరుణ భాయ్, రాజు భాయ్, కుసుం తో పాటు కాంగ్రెస్ నాయకులు శేరి సతీష్ రెడ్డి, గొట్టిముక్కల వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.