Take a fresh look at your lifestyle.

కేంద్రబడ్జెట్ అద్భుతంగా ఉంది – కేంద్రమంత్రి బండి సంజయ్

  • అన్ని వర్గాలకు అనుకూలమైంది

ముద్ర, తెలంగాణ బ్యూరో : కేంద్ర బడ్జెట్ అద్బుతంగా ఉందని, పేద, మధ్యతరగతి, రైతులు, చిరు వ్యాపారుల, యువ పారిశ్రామికవేత్తలకు అనుకూలమైనదని కేంద్రమంత్రి బండి సంజయ్ అన్నారు. . మధ్యతరగతి ఉద్యోగుల, వ్యాపారులకు ఈ బడ్జెట్ ఓ వరమని చెప్పారు. ఉద్యోగులకు రూ.12 లక్షల వరకు పన్ను మినహాయింపు ఇవ్వడం విప్లవాత్మక చర్య అని అన్నారు. గత 75 ఏళ్లలో మధ్య తరగతి ప్రజల కోసం ఇంత అనుకూలమైన బడ్జెట్ ఎనాడు రాలేదన్నారు. 2027 నాటికి అమెరికా, చైనా తరువాత భారత్ ను మూడో ఆర్ధిక వ్యవస్థగా అవతరించే ఆ దిశగానే ఈ బడ్జెట్ ను రూపొందించడం గొప్ప విషయమన్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆధ్వర్యంలో ఇంత గొప్ప బడ్జెట్ ను ప్రవేశపెట్టిన ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నామని బండి సంజయ్ అన్నారుయ బీజేపీ ప్రభుత్వం పేద, మధ్య తరగతి ప్రజల పక్షపాతి అనడానికి నిదర్శనమని అన్నారు. తెలంగాణసహా దేశంలో లక్ష రూపాయల లోపు జీతభత్యాలు పొందే ఉద్యోగులంతా ఇకపై పన్ను కట్టాల్సిన అవసరం లేకపోవడం గొప్ప విషయమని అన్నారు.పేద, మధ్య తరగతి ప్రజలు కొనుగోలు చేసే టీవీ, మొబైల్స్, లెదర్ ఉత్పత్తుల ధరలను భారీగా తగ్గబోతున్నాయని, ఎలక్ట్రిక్ వాహనాలపై ధరలు కూడా తగ్గబోతున్నాయని. దీంతో కాలుష్యం తగ్గే అవకాశముందని కేంద్రమంత్రి బండి సంజయ్ వెల్లడించారు.

Leave A Reply

Your email address will not be published.