Take a fresh look at your lifestyle.

జాతీయ లోక్ అదాలత్ ను సద్వినియోగం చేసుకోండి సిద్దిపేట జిల్లా జడ్జి సాయి రమా దేవి

 

ముద్ర ప్రతినిధి,సిద్దిపేట:

ఈనెల 28 న సిద్దిపేట జిల్లా కోర్టు ప్రాంగణంలో నిర్వహించనున్న జాతీయ లోక్ అదాలత్ ను సద్వినియోగం చేసుకోవాలని సిద్దిపేట జిల్లా జడ్జి సాయి రమా దేవి సూచించారు. బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశం లో మాట్లాడుతూ రాజి కుదుర్చుకోవడానికి అవకాశం ఉన్న కేసులు రాజి కుదుర్చుకోవాలన్నారు. దాని వల్ల సమయం, డబ్బు అదా అవుతాయని తెలిపారు. కుటుంబ తగాదాలు, ఫైనాన్సియల్ డిస్ఫూట్స్, సివిల్ తగాదాలు, ఆక్సిడెంట్ కేసులను రాజి కుదుర్చుకోవడానికి వీలుంటుందన్నారు. గురువారం నుండే కాక్షిదారులు కోర్టులో కేసులు రాజి చేసుకోవడానికి అవకాశం కల్పిస్తున్నామన్నారు. సిద్దిపేట జిల్లా లో మొత్తం 2340 కేసులు రాజి కుదుర్చుకునే అవకాశం ఉన్నదని తెలిపారు.. కక్షి దారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవలన్నారు.

Leave A Reply

Your email address will not be published.