Take a fresh look at your lifestyle.

మృతుడి కుటుంబానికి ఆర్థిక సహాయం

రామకృష్ణాపూర్, ముద్ర : ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన వెంకటేష్ కుటుంబానికి రామకృష్ణాపూర్ యువత జనం కోసం స్వచ్ఛంద సంస్థ పది వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని శనివారం అందించారు.పట్టణంలోని పోచమ్మ బస్తీకి చెందిన పానుగంటి వెంకటేష్ కూలీ పని చేసుకుంటూ జీవనం సాగిస్తారు.మృతునికి భార్య కుమార్తె ఉన్నారు.ఇంకా ఎవరైనా స్వచ్ఛంద సంస్థ సభ్యులు మానవతా దృక్పథంతో ముందుకు వచ్చి మృతుని కుటుంబానికి ఆర్థిక సహాయాన్ని అందించాలని యువత జనం కోసం అధ్యక్షుడు ఎర్రబెల్లి రాజేష్ కోరారు.ఉపాధ్యక్షుడు తిరుపతి,సలహాదారు శివ కిరణ్,రాజు,సంపత్ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.