ముద్ర ప్రతినిధి జడ్చర్ల: బాబు జగ్జీవన్ రావ్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.శనివారం జడ్చర్ల పట్టణంలోని పలు ప్రాంతాల్లో వివిధ సంఘాల నాయకులు బాబు జగ్జీవన్ రావు జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా జడ్చర్ల ప్రభుత్వ వంద పడకల ఆసుపత్రి గ్రామంలో వైద్యుల బృందం ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.ఈ సందర్భంగా ఆసుపత్రి ఆర్ఎం హరినాథ్ మాట్లాడుతూ బాబు జగ్జీవన్ రావు చేసిన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో వైద్య సిబ్బంది డాక్టర్ వంశీ, డాక్టర్ స్వప్న, హెడ్ నర్స్ భాగ్యలత డయాలసిస్ సిబ్బంది వేణు వైద్య సిబ్బంది పాల్గొన్నారు.